Thaai Kizhavi | కోలీవుడ్‌లో ప్రేక్షకుల కొరత కారణంగా థియేటర్లు మూవీ షోలను ప్రదర్శించేందుకు ఇబ్బందులు పడుతున్నాయి. పెద్ద సినిమాలేమి అంతగా విడుదల కాలేదు. మరోవైపు లో బడ్జెట్ సినిమాలు కూడా జనాలను థియేటర్లకు రప్పించడంలో విఫలమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శివకార్తికేయన్ తెరకెక్కించిన Thaai Kizhavi కోలీవుడ్ ఎగ్జిబిటర్లకు ఆశాకిరణంగా మారింది.
శివకార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ లీడ్ రోల్లో నటించింది. ఈ మూవీ ఓపెనింగ్ డే నుంచి బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. శని, ఆదివారం నాటికి ఈ చిత్రానికి చాలా ప్రాంతాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి. తాజా కథనాల ప్రకారం ఈ మూవీ ఓపెనింగ్ వీకెండ్లో రూ.22 కోట్లు సాధించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
చిన్న బడ్జెట్ సినిమాకు ఈ ఫిగర్ ఎక్కువేనని చెప్పాలి. లాంగ్ రన్లో కూడా మంచి ఆక్యుపెన్సీతో ముందుకెళుతోంది. శివకుమార్ మురగేశన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రైచల్ రబెకా, అతడి కుమరన్, సంగపులి, మునిష్కాంత్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. నివాస్ కే ప్రసన్న మ్యూజిక్ అందించాడు.
Funky | థియేటర్లలో యావరేజ్ హిట్… ఇప్పుడు ఓటీటీలోకి ‘ఫంకీ’, స్ట్రీమింగ్ ఎప్పటి నుండి అంటే?