లక్నో: పెళ్లైన కొన్ని గంటల్లోనే ఒక జంట విడిపోయింది. భర్తతో కలిసి తాను జీవించలేనని నవ వధువు తెగేసి చెప్పింది. తాను మరో వ్యక్తిని ప్రేమించానని, అయితే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆరోపించింది. దీంతో ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. చివరకు ఆ జంట వెంటనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించింది. (Couple’s Marriage Lasted Few Hours) ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 24న ధరమ్ సింగ్ కుష్వాహాకు మిథిలేష్ కుమారితో పెళ్లి జరిగింది. అనంతరం నవ వధువు మిథిలేష్ కుమారి భర్త ఇంటికి వెళ్లింది. అయితే తొలి రాత్రి రోజు భర్తతో కలిసి జీవించలేనని తెగేసి చెప్పింది. తాను మరో వ్యక్తిని ప్రేమించానని, తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు కొట్టి బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆమె ఆరోపించింది.
కాగా, ఇది విని ధరమ్ సింగ్ కుష్వాహా, అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పెళ్లికి ముందే వధువు ఈ విషయం చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ధరమ్ సింగ్ కుష్వాహా వాపోయాడు. అప్పుడు తమ ఇద్దరికి పెళ్లి జరిగేది కాదని, రెండు కుటుంబాలు ఈ అవమానాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.
మరోవైపు రెండు కుటుంబాల మధ్య ఈ విషయంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో హమీర్‌పూర్‌లోని రాత్ పోలీస్ స్టేషన్‌కు ఇరు కుటుంబాలు చేరుకుని ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో పెళ్లైన కొత్త జంటకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు పోలీస్ అధికారి ప్రయత్నించారు.
అయితే వివాహాన్ని కొనసాగించేందుకు మిథిలేష్ కుమారి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో విడిపోయేందుకు ఇరు కుటుంబాలు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. దీంతో వెంటనే విడాకులు తీసుకోవాలని ఆ జంట నిర్ణయించింది. అనంతరం మిథిలేష్ కుమారి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
Also Read:
Kolkata Earthquake | కోల్‌కతాలో భారీ భూకంపం.. భయంతో ఇళ్లను వీడిన జనం
Students Chain Snatching | మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ.. మెడికల్ కాలేజీ విద్యార్థులు అరెస్ట్
Watch: పది వేల విలువైన లోదుస్తులు.. షాపులో చోరీ చేసిన మహిళలు