చండీగఢ్: ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి ఒక స్కూల్ వద్దకు చేరుకున్నాడు. ఒక టీచర్ గురించి అడిగాడు. ఆమె బయటకు రాగానే కత్తితో దాడి చేస్తూ ఈడ్చుకెళ్లాడు. మెడపై పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Teacher Stabbed By Masked Man) హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 29న ఉదయం 9.30 గంటల సమయంలో ముఖానికి మాస్క్ ధరించిన వ్యక్తి సిక్రోనా ప్రాంతంలోని ప్రైవేట్ స్కూల్ గేట్ వద్దకు చేరుకున్నాడు. ఆ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సంధ్యను కలవాలని చెప్పాడు. ఆమె వచ్చే వరకు అక్కడ వేచి ఉన్నాడు.
కాగా, టీచర్ సంధ్య బయటకు రాగానే ఆ వ్యక్తి ఆమెను పక్కకు ఈడ్చుకెళ్లాడు. వెంట తెచ్చిన కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆమె అరుపులు విన్న స్కూల్ నిర్వాహకుడు పరుగున బయటకు వచ్చాడు. ఆ వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కత్తితో అతడు బెదిరించడంతో లోపలకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి నేలపై పడిన టీచర్ సంధ్య మెడపై పలుసార్లు కత్తితో పొడిచాడు. అనంతరం నంబర్ ప్లేట్ లేని బైక్‌పై అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు కత్తిపోటు గాయాలతో అచేతనంగా పడి ఉన్న టీచర్ సంధ్యను అల్ ఫలాహ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ ఉపాధ్యురాలిపై దాడి చేసిన వ్యక్తి అమిత్ అని స్థానికులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన పూర్వ విద్యార్థి అమిత్‌ను ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ టీచర్‌ను అతడు వేధిస్తున్నట్లు పోలీస్ అధికారి ఆరోపించారు. అయితే ఆ స్కూల్ ప్రాంగణంలోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Woman teacher stabbed to death in broad daylight at Faridabad school pic.twitter.com/r1FClMv2m2
— Raajeev Chopra (@Raajeev_Chopra) August 3, 2026