Makutam | తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాస్ బేస్ ఉన్నయాక్టర్లలో ఒకడు విశాల్ (vishal). ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న మూవీ ‘మకుటం’. దుషార విజయన్, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తంబి రామయ్య, ఐర్జె తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.
ఆగస్టు 7న మకుటం ట్రైలర్ లాంచ్ చేయనున్నట్టు తెలియజేశారు మేకర్స్. విశాల్ మూడు డిఫరెంట్ గెటప్స్‌లో ఉన్న పోస్టర్‌ను షేర్ చేసి క్యూరియాసిటీ పెంచుతున్నారు.
ఈ చిత్రంలో జాన్ విజయ్, జయ ప్రకాశ్, ఆర్ బీజీన్ చౌదరి, జితన్ రమేశ్, జీవా, పదం కుమార్, ఝాన్సీ అబూ సలీం, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి వస్తున్న 99వ సినిమా ఇది. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మండుతున్న శవంలో నుంచి సిగరెట్ వెలిగించుకుంటూ హీరో ఎంట్రీ ఇచ్చే సీన్‌తో మొదలై అంజలి మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తుంది. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న గెటప్స్‌లో విశ్వరూపం చూపించాడు విశాల్. విజువల్స్, యాక్షన్ పార్ట్, బీజీఎం.. ఇలా ప్రతీది సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయమని టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. విశాల్ నుంచి అభిమానులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నట్టు అర్థమవుతోంది.
మకుటం చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. విశాల్ దర్శకత్వ బాధ్యతలతోపాటు స్క్రీన్‌ప్లే కూడా చూసుకోనున్నాడు. విశాల్, అంజలి హిట్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
The Crown is Ready !!#Magudam /#Makutam Trailer from August 7th & releasing Worldwide on August 14th#DirectorVishal #SGF99 #MagudamTrailerFromAug7th #MagudamReleaseOnAug14th pic.twitter.com/YLJ0x9EjY9
— Vishal (@VishalKOfficial) August 5, 2026