కీవ్: ఉక్రెయిన్‌పై బాలిస్టిక్ క్షిపణులు(Ballistic Missiles), డ్రోన్లతో రష్యా అటాక్ చేసింది. తాజా దాడిలో 17 మంది మరణించారు. 44 మంది గాయపడినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కీవ్‌పై చాలా భీకర స్థాయిలో రష్యా విరుచుకుపడింది. బుధవారం అర్థరాత్రి నుంచి ఆ దాడులు మొదలయ్యాయి. నగరంలోని మిలిటరీ అడ్మినిస్ట్రేషన్‌ను రష్యా టార్గెట్ చేసినట్లు తెలిసింది. దాడుల వేళ సుమారు గంటకుపైగా ఎయిర్ రెయిడ్ సైరన్లను మోగించారు. క్షిపణుల దాడుల వల్ల రెసిడెన్షియల్ బిల్డింగ్లు, వేర్‌హౌజ్‌లు ధ్వంసం అయ్యాయి. అయితే రష్యా బాలిస్టిక్ దాడుల్ని తిప్పికొట్టేందుకు అమెరికా నిర్మిత పేట్రియాట్ మిస్సైల్ ఇంటర్‌సెప్టార్లు కావాలని ఉక్రెయిన్ తమ మిత్రదేశాలను కోరింది.
కీవ్‌లో ఉన్న లాజిస్టిక్ హబ్స్, సప్లయ్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. రకరకాల ఆయుధాలు, మిలిటరీ ఉత్పత్తులు ఆ స్టోరేజ్ కేంద్రాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. నల్ల సముద్రం పోర్టు ఒడిసీ వద్ద వెపన్స్, మిలిటరీ సామాగ్రి సరఫరా చేస్తున్న మూడు కార్గో నౌకలను కూడా పేల్చినట్లు తెలిసింది. రష్యా సుమారు 24 బాలిస్టిక్ క్షిపణులు, నాలుగు యాంటీ షిప్ మిస్సైల్‌తో దాడి చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొన్నది. 115 డ్రోన్లతో దాడి చేయగా, దాంట్లో తమ రక్షణ వ్యవస్థ 98 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది.
As of now, 44 people have been reported injured in the massive Russian strike on Kyiv and the Kyiv region. Another 17 people, tragically, were killed. My condolences to their families and loved ones. It was a heavy strike – 24 ballistic missiles, 4 Zircon/Oniks missiles, and… pic.twitter.com/4LoHXXkt8R
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 5, 2026