BRS MP : బీఆర్ఎస్ ఎంపీ దీనకొండ దామోదర్ రావు (Damodar Rao Divakonda)కు మరో గౌరవం లభించింది. రాజ్యసభ సభ్యుడైన ఆయన తాజాగా పార్లమెంటరీ రక్షణ శాఖ స్థాయి సంఘం 2026-27 కమిటీలో చోటు దక్కించుకున్నారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనతో పాటు ఆంధ్ర ప్రదేశ్ నుంచి కేశినేని శ్రీనాథ్ ఈ కమిటీకి ఎంపికయ్యారు. లోకసభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, హీరో కమల్ హాసన్ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. రాధా మోహన్ సింగ్ చైర్మన్గా వ్యవహరించనున్న ఈ కమిటీలో రాజ్య సభ నుంచి పది మంది ఎంపీలు, లోక్ సభ నుంచి 21 మంది ఎంపీలకు చోటు లభించింది.
పార్లమెంట్లో పలు స్థాయి సంఘాలకు 2026-27 వార్షిక కాలానికి సభ్యులను ప్రకటించింది. రక్షణ కమిటీలో బీఆర్ఎస్ ఎంపీ డి.దామోదర్ రావు సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆయనతో సహా రాజ్య సభ నుంచి 10 మంది ఈ కమిటీకి ఎంపికయ్యారు. రాధా మోహన్ సింగ్ చైర్మన్గా వ్యవహరించనున్న ఈ కమిటీలో లోక్ సభ నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు 20 మందికి చోటు దక్కింది.
వాణిజ్యం, విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలు.. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, హోమ్ వ్యవహారాలు, పరిశ్రమలు.. వ్యక్తిగత, ప్రజా విజ్ఞప్తులు.. శాస్త్ర సాంకేతిక, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు..రవాణా, పర్యాటకం.. వ్యవసాయం, పశుసంపద, ఆహార పరిశ్రమ.. రసాయనాలు, ఎరువులు.. బొగ్గు, గనులు, ఉక్కు.. సమాచార, సాంకేతికత, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ.. ఇంధనం, విదేశీ వ్యవహారాలు, ఆర్ధికం, గృహ నిర్మాణం, కార్మికులు, వస్త్ర పరిశ్రమ, నైపుణ్య అభివృద్ధి, పెట్రోలియం, సహజ వాయువు, రైల్వే, గ్రామీణ అభివృద్ధి, పంజాయతీ రాజ్, సామాజిక న్యాయం, సాధికారిత, నీటి వనరులు.. వంటి 24 కమిటీలకు సభ్యలను ఎంపిక చేసింది పార్లమెంట్. ఆయా కమిటీ సభ్యులు తమ విభాగానికి సంబంధించిన నివేదికను లోక్ సభ, రాజ్య సభకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 26వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఈ మేరకు శనివారం పార్లమెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది.