Suriya | సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్న సూర్య, జ్యోతిక దంపతులు వివాహం జరిగి రెండు దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ అన్యోన్యంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరిద్దరూ తమ కెరీర్ తొలి రోజుల జ్ఞాపకాలను, వైవాహిక జీవిత విశేషాలను పంచుకున్నారు. కెరీర్ ఆరంభంలో తాను సూర్య కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేదానినని జ్యోతిక సరదాగా గుర్తుచేసుకోగా, ఆ మాటలకు సూర్య నవ్వులు చిందించారు. ఆ తర్వాత వెంటనే స్పందిస్తూ.. ప్రస్తుతం అది 30 రెట్లు తక్కువైంది అంటూ జ్యోతిక జోక్ చేయడం అక్కడ అందరినీ నవ్విచించింది.
తమ సంబంధం సాంప్రదాయ లింగ వివక్షపై కాకుండా కేవలం పరస్పర గౌరవంపైనే ఆధారపడి ఉంటుందని జ్యోతిక తెలిపారు. సూర్యను ఒక ‘గ్రీన్ ఫ్లాగ్’గా అభివర్ణించిన ఆమె, తమ మధ్య భార్యాభర్తలుగా సమానత్వం ఉంటుందని చెప్పారు. వంట చేయడం ఇష్టం లేకపోతే బలవంతం చేయకపోవడం, పనులను పంచుకోవడం వంటి అంశాలలో సూర్య చాలా గొప్పగా వ్యవహరిస్తారని కొనియాడారు. సూర్య కెరీర్లోనూ జ్యోతిక కీలక పాత్ర పోషించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘కాకా కాకా’ చిత్రంలో హీరోయిన్గా నటించిన ఆమె, ఆ సినిమాలో హీరోగా సూర్య పేరును సిఫార్సు చేశారు. ఆ సినిమానే సూర్య కెరీర్‌కు మొట్టమొదటి భారీ సోలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట 2006లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక, ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన పాత్రలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం వీరు ఇద్దరూ కలిసి సినిమాల్లో నటిస్తూనే, ‘2D ఎంటర్టైన్మెంట్’ బ్యానర్‌పై చిత్రాలను నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు.