సారా అర్జున్ మ్యూజికల్ లవ్‌స్టోరీ
బాలనటిగా పలు చిత్రాల్లో మెప్పించిన సారా అర్జున్ ‘ధురంధర్' చిత్రంతో కథానాయికగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్లో ఈ భామ బంపరాఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది.
బాలనటిగా పలు చిత్రాల్లో మెప్పించిన సారా అర్జున్ ‘ధురంధర్’ చిత్రంతో కథానాయికగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్లో ఈ భామ బంపరాఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ రూపొందించనున్న ఓ సంగీతభరిత ప్రేమకథా చిత్రంలో సారా అర్జున్ కథానాయికగా ఖరారైనట్లు తెలిసింది. ఈ చిత్రానికి మనీష్శర్మ దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
మొత్తం ఎనిమిది పాటలతో మ్యూజికల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ సినిమా సారా అర్జున్ కెరీర్లో కీలక మైలురాయి కానుందని, యశ్‌రాజ్ ఫిల్మ్స్ వంటి నిర్మాణ సంస్థలో అవకాశం అందుకోవడం ఆమె కెరీర్‌కు మరింత ఊపునిస్తుందని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ఇక దర్శకుడు మనీశ్‌శర్మ ‘బ్యాండ్ బాజా బారాత్’ ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ వంటి చిత్రాలతో ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

