ప్రజాస్వామ్యానికి ముప్పు!
ఇందిర కాలం నాటి ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ రాజకీయ సోపానాలు అధిరోహించిన బీజేపీ ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తూ ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నది. అన్నిటికీ మించి ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఓటుహక్కుపైనే దాడి చేస్తున్నది. అందుకు సాక్షాత్తూ ఎన్నికల సంఘాన్నే పావుగా వాడుకుంటున్నదని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్డబ్ల్యూ) భారతీయ ప్రజాస్వామ్యం ఎందుర్కొంటున్న అస్తిత్వ సమస్యలపై విడుదల చేసిన కీలక నివేదిక ప్రకంపనలు సృష్టిస్తున్నది.
ఇందిర కాలం నాటి ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ రాజకీయ సోపానాలు అధిరోహించిన బీజేపీ ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తూ ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నది. అన్నిటికీ మించి ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఓటుహక్కుపైనే దాడి చేస్తున్నది. అందుకు సాక్షాత్తూ ఎన్నికల సంఘాన్నే పావుగా వాడుకుంటున్నదని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్డబ్ల్యూ) భారతీయ ప్రజాస్వామ్యం ఎందుర్కొంటున్న అస్తిత్వ సమస్యలపై విడుదల చేసిన కీలక నివేదిక ప్రకంపనలు సృష్టిస్తున్నది. ‘ఇంతకూ ఏ రకం ప్రజాస్వామ్యం ఇది? మోదీ నిరంకుశాధికార క్రీడ’ అనే అర్థం వచ్చే ఆంగ్ల శీర్షికతో వెలువడిన 95 పేజీల నివేదిక భారత్‌లో ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులుగా నిలవాల్సిన రాజ్యాంగ సంస్థలే పాలకుల రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయన్న ఆందోళనను అది మరోసారి ప్రముఖంగా ముందుకు తెచ్చింది.
గత దశాబ్ది పైచిలుకు కాలంగా మోదీ ప్రభుత్వం పార్లమెంటరీ సంప్రదాయాలను బలహీనపరచడం, ప్రతిపక్షాల గొంతు నొక్కడం, కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొల్పడం మాత్రమే కాకుండా ఎన్నికల సంఘం వంటి కీలక రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కూడా దెబ్బతీస్తున్నదని ఆ నివేదిక పేర్కొన్నది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమవుతున్నదని, ఓటర్ల జాబితాల్లో అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను సమర్థవంతంగా విచారించడం లేదని ఎత్తిచూపడం గమనార్హం.
ముఖ్యంగా 2025 జూన్ నుంచి చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ద్వారా దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా పేర్లు తొలగించడం, ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించడం, అర్హులైన ఓటర్లు కూడా తమ ఓటుహక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడటం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన హెచ్చరికగా ఆ నివేదిక అభివర్ణించింది. నివేదిక ఎత్తిచూపిన మరో కీలక అంశం ఎన్నికల సంఘం నియామకాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని పెంచిన 2023 చట్టం. కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిపై సందేహాలను పెంచిందని హెచ్ఆర్డబ్ల్యూ నివేదిక స్పష్టంచేసింది. ఒక అంతర్జాతీయ సంస్థ చేసిన ఈ విశ్లేషణను కేవలం ‘విదేశీ’ అనే నెపంపై కొట్టిపారేయడం సాధ్యం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుత ఎన్నికలు, స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు ఎంత కీలకమో గుర్తుచేస్తున్న హెచ్చరిక ఇది.
నిజానికి హెచ్ఆర్డబ్ల్యూ నివేదికలోని అంశాలేవీ పూర్తిగా కొత్తవని చెప్పలేం. వీటిపై దేశవ్యాప్తంగా కొన్నాళ్లుగా రాజకీయ దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడంపైనే ఎన్నికల సంఘం దృష్టి కేంద్రీకృతమైందని, ఎంతమందిని తొలగిస్తే అంత మంచి మార్కులు వస్తాయన్నట్టుగా వ్యవహరిస్తున్నదని ప్రధాన ఎన్నికల మాజీ కమిషనర్ ఎస్‌వై ఖురేషీ విమర్శించడం గమనార్హం. సామాజిక కార్యకర్తలు, పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు కూడా పేదలు, వలస కార్మికులు, మహిళలు, దళితులు, మైనారిటీలు అవసరమైన పత్రాలు సమర్పించలేక ఓటుహక్కును కోల్పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
ఈ పరిణామాలన్నింటినీ విడివిడిగా చూడలేం. ఓవైపు ప్రజాస్వామ్యాన్ని పరిహస్తున్న బీజేపీ మరోవైపు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట పాదయాత్రలు చేపట్టడం విడ్డూరం. హెచ్ఆర్డబ్ల్యూ నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి సంస్థల అధ్యయనాలన్నీ కూడా విదేశీ దుష్ప్రచారం అంటూ కొట్టిపారేసిన చరిత్ర కేంద్ర పెద్దలకు ఉన్నది. ఈసీకి నిఖార్సయిన తటస్థత, పారదర్శకత కీలకం. వాటిపై నీలినీడలు పరుచుకుంటే ప్రజాస్వామ్యమే వీగిపోతుంది. ఎన్నికల్లో ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి అనేది ప్రజలు నిర్ణయించాలి తప్ప ప్రభుత్వాలు, అధికార పార్టీ, దానికి అనుకూలంగా వ్యవహరించే ఎన్నికల సంఘం కాదు. ‘సర్’ ప్రక్రియపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి, లాగేసుకున్న ఓటుహక్కును పునరుద్ధరించడం తక్షణావసరం. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో ప్రభుత్వ ఆధిపత్యాన్ని తొలగించి, ప్రతిపక్షాలకు సముచిత భాగస్వామ్యం కల్పించాలి. జాతీయ జెండా అందరిదీ అయినట్టే ప్రజాస్వామ్యం కూడా అందరిదీ. దానిని ఒక పార్టీ సొంత ఆస్తిగా మార్చుకోవడం ప్రజాస్వామ్యాన్ని తల్లకిందులు చేయడమే.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

