తనకో నీతి, పరులకో నీతి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ఇది. విపక్షాల మీద ఊ అంటే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్రం, తనకు సంబంధించిన వారి మీద ఎంతటి తీవ్ర ఆరోపణలు వచ్చినా చర్యలు తీ�
మత చిచ్చు పెట్టటమే అధికారానికి దగ్గరి దారి అనీ, జాతి సంపదను కొందరు కార్పొరేట్ గద్దలకు పంచి పెట్టటమే ఆర్థిక విధానం అనీ అనుకునే వాళ్లు దేశాన్ని ఏలుతున్న సమయం ఇది.
ఖలిస్థానీ కారుమబ్బులు పంజాబ్‌పై మరోసారి అలుముకుంటున్నాయి. నలభై ఏండ్ల కింద ఆ రాష్ర్టాన్ని అతలాకుతలం చేసిన వేర్పాటువాదం మళ్లీ పడగ విప్పుతున్నది. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే నినాదం జోరందుకుంటున్నది.
ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా, ఐరోపా ద్రవ్య వ్యవస్థల్లో ఏర్పడిన అలజడి, అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం, ఇతర అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఆటుపోట్లు చూస్తుంటే ఇదంతా ఎటు దారితీస్తుందా అనే భయం కలుగుతున్నది.
200 మంది ప్రదర్శనగా వెళ్తుంటే వారిని ఆపటానికి 2000 మంది పోలీసులు అడ్డం నిలిచారు. ఆ ప్రదర్శకులు సంఘవిద్రోహ శక్తులో, కరడుగట్టిన నేరస్థులో కాదు.. గౌరవ పార్లమెంటు సభ్యులు. గౌతమ్ అదానీ కుంభకోణంపై హిండెన్‌బర్గ్ న
‘రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు కొత్తగా జరుగుతున్నయా? ఏండ్ల నుంచీ ఉన్నవే కదా!’- రాష్ట్రంలో అన్నదాతలు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నారని విలేకరులు ప్రశ్నిస్తే మహారాష్ట్ర వ్యవసాయమంత్రి స్పందన ఇది.
ఈడీ కోరలకు మోదీ సర్కార్ మరింత పదును పెట్టింది. ఈ మేరకు ఈ నెల 7న రెండు గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసింది. తద్వారా 2023- మనీల్యాండరింగ్ నిబంధనలకు కొత్త క్లాజును చేర్చింది. దీనితో వ్యక్తుల, సంస్థల ఆర్థిక లావ�
రువాండా.. ఆఫ్రికాలో ఒక చిన్న దేశం. జనాభా కోటిన్నర ఉండదు. అటువంటి దేశం 1994లో జాతిపరమైన విద్వేషంలో కూరుకుపోయి భయంకరమైన హత్యాకాండ చోటు చేసుకుంది. కేవలం 100 రోజుల్లో దాదాపు 8 లక్షల మంది టుట్సీ జాతి ప్రజలు మరణించార�
లింగ సమానత్వం ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు.. అది శాంతియుత, సుసంపన్న, సుస్థిరాభివృద్ధితో కూడిన ప్రపంచానికి అత్యవసరమైన పునాది అని ఐక్యరాజ్యసమితి తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్నది.
‘ప్రజాస్వామ్యం విజయవంతం కావటంలో ప్రతిపక్షాల నిర్మాణాత్మక పాత్ర కీలకమైనది’ అని రాజనీతిశాస్త్రం చెబుతుంది. ప్రధానికి విపక్ష నేతలు, ముఖ్యమంత్రులు రాసిన లేఖను ఇటువంటి నిర్మాణాత్మక పాత్రను పోషించటంలో భాగ
నిరంకుశ, ప్రతీకార రాజకీయానికి పరాకాష్ఠ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు. బీజేపీ నేతలు, కేంద్రం పెద్దలు చెప్పినట్లుగా నడుచుకుంటే మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌షిండేకు లభించినట్లుగా సిసోడియాకు ఢి�
అవే నేలలు.. నాడు పగుళ్లతో కరువు కాటకాలకు నిలయమైతే, నేడు సిరులు పండించే భూములయ్యాయి. అవే వేదికలు.. నాడు ఆర్భాటపు ప్రకటనలకు, ఆచరణకు రాని పథకాలకు అడ్రస్‌గా నిలుస్తే నేడు వేల కోట్ల పెట్టుబడుల వెల్లువకు, ఉద్యోగా
అణ్వాయుధాల తగ్గింపు (న్యూ స్టార్ట్) ఒప్పందం నుంచి వైదొలగుతామని రష్యా ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది. అమెరికా, రష్యా మధ్య కుదిరిన పలు ఆయుధ నియంత్రణ ఒప్పందాల్లో ‘న్యూ స్టార్ట్' చివరిది.