డెహ్రాడూన్: కొండ ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో ప్రయాణించిన కారు అదుపుతప్పింది. రోడ్డు నుంచి జారి పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. పలుసార్లు పల్టీలు కొట్టింది. (Car Plunges Into Gorge) అదృష్టవశాత్తు ఆ కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ముస్సోరీలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం 6.30 గంటల సమమంలో రహదారిపై వెళ్తున్న తెల్లటి కారు అదుపుతప్పింది. రోడ్డు నుంచి జారి పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. పలుసార్లు బోల్తాకొట్టింది.
కాగా, గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ధ్వంసమైన కారులో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. 20 ఏళ్ల రాజ్వీర్ సింగ్‌గా అతడ్ని గుర్తించారు.
మరోవైపు కారులో ఒక్కడే ఉన్న ఆ డ్రైవర్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే లోయలోకి కారు దూసుకెళ్లి పల్టీలు కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मसूरी में कार के गहरी खाई में गिरने का लाइव वीडियो, घायल है लेकिन सब सुरक्षित है। pic.twitter.com/iFZrPYYPHD
— Ajit Singh Rathi (@AjitSinghRathi) November 24, 2025
Also Read:
Meerut Blue Drum Case | బిడ్డకు జన్మనిచ్చిన.. మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు నిందితురాలు ముస్కాన్
US pilot quits Dubai air show | తేజస్ క్రాష్ తర్వాత.. ఎయిర్ షో నుంచి తప్పుకున్న అమెరికా పైలట్