లక్నో: సంచలనం రేపిన మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు నిందితురాలు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. (Meerut Blue Drum Case) అరెస్ట్ తర్వాత ఆమె గర్భవతిగా తేలింది. జైలులో ఉన్న ఆమెకు సోమవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గట్టి భద్రత మధ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది మార్చి 3న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ముస్కాన్ రస్తోగి తన ప్రియుడు సాహిల్‌తో కలిసి భర్త సౌరభ్‌ను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి నీలిరంగు డ్రమ్‌లో వేశారు. దానిని సిమెంట్‌తో నింపారు.
కాగా, భర్త హత్య తర్వాత సిమ్లా వెళ్లిన ఈ జంట అక్కడ ఎంజాయ్ చేశారు. మార్చి 17న మీరట్‌కు తిరిగి వచ్చారు. బ్లూ డ్రమ్ పడేసేందుకు ప్రయత్నించగా భర్త సౌరభ్ హత్య విషయం బయటపడింది. దీంతో ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు ఏప్రిల్‌లో జైలులోని ఖైదీలకు నిర్వహించిన సాధారణ వైద్య పరీక్షల్లో ముస్కాన్ గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. ప్రియుడు సాహిల్ ద్వారా ఆమె గర్భం దాల్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. తాజాగా నెలలు నిండటంతో సోమవారం ముస్కాన్‌కు నొప్పులు వచ్చాయి. దీంతో భద్రత మధ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బిడ్డకు జన్మనిచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
The Meerut Blue Drum Murder case accused gave birth
Muskan was admitted to a Govt hospital after labour pain, but don’t you think the baby’s life would be bleak? pic.twitter.com/3iCAZvmAT9
— Krishna Chaudhary (@KrishnaTOI) November 24, 2025
Also Read:
Pankaja Munde’s Key Aide Arrested | భార్య ఆత్మహత్య.. మంత్రి కీలక సహాయకుడు అరెస్ట్