ముంబై: మంత్రి కీలక సహాయకుడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అతడికి వివాహేతర సంబంధం ఉన్నదని, దీంతో భార్యను వేధిస్తున్నట్లు ఆమె కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కీలక సహాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Pankaja Munde’s Key Aide Arrested) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. మంత్రి పంకజ ముండే వ్యక్తిగత సహాయకుడిగా అనంత్ గార్జే పని చేస్తున్నాడు. అతడి భార్య గౌరీ పాల్వే శనివారం సాయంత్రం వర్లి ప్రాంతంలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.
కాగా, అనంత్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నదని గౌరీ కుటుంబం ఆరోపించింది. ఆ మహిళతో చాటింగ్ చేయడాన్ని గౌరీ గమనించడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని పేర్కొంది. అనంత్ హింసించి వేధిస్తుండటంతో గౌరీ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో వర్లి పోలీసులు సోమవారం ఉదయం అనంత్ గార్జేను అరెస్ట్ చేశారు.
మరోవైపు ప్రభుత్వ కేఈఎం ఆసుపత్రిలో దంత వైద్యురాలైన గౌరీతో అనంత్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 7న పెళ్లి జరిగింది. మంత్రి పంకజ ముండే, మాజీ ఎంపీ ప్రీతమ్ ముండేతో సహా పెద్ద సంఖ్యలో ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.
Also Read:
Man Kills Woman | పెళ్లి చేసుకోవాలని 60 ఏళ్ల మహిళ ఒత్తిడి.. హత్య చేసిన వ్యక్తి