Jr NTR | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఒక ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి అతిథిగా విచ్చేసిన తారక్ ఈ వేడుక అనంతరం ఆసుపత్రి సిబ్బందితో కలిసి ముచ్చటించాడు. అయితే నేడు మహిళ దినోత్సవం సందర్భంగా ఒక లేడి డాక్టర్ తారక్‌ని అడుగుతూ.. ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళలను ఎలా గౌరవించాలో చెప్పండి అని అడుగగా.?
తారక్ మాట్లాడుతూ.. మహిళలను ఎలా గౌరవించాలో పదేపదే గుర్తుచేస్తూ ఉండటం నాకు నచ్చదు. పుట్టుకతోనే ప్రతి పురుషుడు మహిళల పట్ల గౌరవంతో పుట్టాల్సిన సమయం ఇది. మనం మన పిల్లలకు మన ఇళ్ల నుండే సరైన విద్యను అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నా ఇద్దరు కుమారులు మహిళలను గౌరవిస్తూ పెరిగేలా నేను ఖచ్చితంగా చూసుకుంటాను అని ఎన్టీఆర్ వెల్లడించాడు. ఇక తారక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత సమాజంలో మహిళల భద్రత మరియు గౌరవం గురించి జరుగుతున్న చర్చల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన కుమారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతానని ఆయన చేసిన ప్రతిజ్ఞకు అభిమానుల నుంచి మరియు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.