Brij Bhushan | మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్కు క్లీన్ చిట్
Brij Bhushan | భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించాడని భారత మహిళా రెజ్లర్లు అతడిపై కేసు వేశారు. ఢిల్లీ కోర్టు సోమవారం అతడిని నిర్దోషిగా ప్రకటించింది.
Brij Bhushan | భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (Wrestling Federation of India, WFI)కు చీఫ్గా బ్రిజ్ భూషణ్ పనిచేశారు. 2023, ఏప్రిల్లో ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. ఏప్రిల్ 28న అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అతడిపై రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి లైంగిక వేధింపులు, పరువుకు భంగం కలిగించడం, వెంటపడటంపై ఫిర్యాదు కాగా. రెండోది మైనర్ రెజ్లర్ ఫిర్యాదు ద్వారా పోక్సో కేసు నమోదయ్యాయి. దీంతో అతడితో పాటు డబ్ల్యూఎఫ్ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది.
32 మంది సాక్షుల వివరణ, నిందితుల వాంగ్యూలాలపై విచారణ చేపట్టింది కోర్టు. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అడిషనల్ చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ (ACJM) అశ్విని పన్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025లో మైనర్ ఫిర్యాదుదారకు సంబంధించిన పోక్సో కేసులో ఢిల్లీ పోలీసులు సమర్పించిన ‘క్లోజర్ రిపోర్ట్ (కేసును మూసివేసే నివేదిక)ను’ కూడా కోర్టు ఆమోదించింది. భారత క్రీడా రంగంలో అత్యంత ప్రముఖమైన కేసుల్లో ఒకటి అయిన ఈ కేసుకు ముగింపు పలికారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

