Crime News : అమెరికా (USA) లోని దక్షిణ ఇడాహో (South Idaho) లో ఉన్న ఇన్-అండ్-అవుట్ (In and Out) బర్గర్ రెస్టారెంట్ (Burger Restaurant) లో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ట్విన్ ఫాల్స్ నగర (Twin Falls City) అధికార ప్రతినిధి వెల్లడించారు.
కాల్పులకు పాల్పడిన అనంతరం ఆగంతకుడు కూడా తనను తాను కాల్చుకుని మరణించాడు. కాల్పులకు తెగబడిన అనుమానిత వ్యక్తి మృతదేహాన్ని రెస్టారెంట్ సమీపంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకుగల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.