బెంగళూరు: ఒక ఆటో డ్రైవర్ మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఆటో నడిపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను నిలువరించారు. బ్రీత్ టెస్ట్‌కు అతడు నిరాకరించాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆ ఆటో డ్రైవర్ నిప్పంటించుకున్నాడు. (Drunk Auto Driver Sets On Fire) కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి మహాత్మా గాంధీ సర్కిల్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి ఆటో నడుపుతున్న 38 ఏళ్ల తిప్పేస్వామిని అడ్డుకున్నారు. బ్రీత్ టెస్ట్ చేయాలని పోలీసులు కోరగా అతడు నిరాకరించాడు.
కాగా, పోలీసులతో వాగ్వాదానికి దిగిన తిప్పేస్వామి నిప్పంటించుకుంటానని బెదిరించాడు. బాటిల్లో ఉన్న పెట్రోల్‌ను నేలపై పోసి నిప్పంటించాడు. అయితే తిప్పేస్వామి టీ షర్ట్‌పై కూడా పెట్రోల్ పడటంతో అతడికి మంటలు అంటుకున్నాయి. చేతిలో పెట్రోల్ బాటిల్ ఉండటంతో మంటలు ఎక్కువయ్యాయి.
మరోవైపు స్పందించిన పోలీసులు మంటలను ఆర్పారు. 70 శాతం కాలిన గాయాలైన తిప్పేస్వామిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఆత్మహత్యా యత్నం, ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకున్న సెక్షన్ల కింద తిప్పేస్వామిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Also Read:
Chandigarh Bill Row | చండీగఢ్ బిల్లుపై వివాదం.. తుది నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం
Uranium In Breast milk | తల్లి పాలలో యురేనియం.. ఆందోళన కలిగిస్తున్న అధ్యయనం
School Girl Raped | స్కూల్ గ్రౌండ్లో బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తి
Girl Dies By Suicide | పేరెంట్స్ మొబైల్ ఫోన్ కొనివ్వలేదని.. బాలిక ఆత్మహత్య