ఊట్కూర్, మార్చి 6 : రేవంత్ పాలన లో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ దౌర్జన్యం రోజురోజుకూ పెరిగిపోతున్నది. రోజూ ఏదో ఒకచోట కాంగ్రెస్ నాయకులు అరాచకానికి పాల్పడుతున్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూరు మండ లం తిప్రాస్‌పల్లికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ సుమంగళ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. బాధితులు, స్థానికుల కథనం మేరకు.. శుక్రవారం సాయంత్రం తిప్రాస్‌పల్లిలో మాజీ సర్పంచ్ సుమంగళ భర్త నారాయణ మెయిన్ రోడ్డు సమీపంలోని అతడి తమ్ముడు వెంకటేశ్ ఇంటి వద్ద కూర్చొని మాట్లాడుతున్నాడు.
కాంగ్రె స్ నాయకుడు, సర్పంచ్ విజయలక్ష్మి భర్త నర్సింహ, అతడి అనుచరులు అక్కడికి చేరుకొని అకారణంగా దాడికి పాల్పడ్డా రు. ఈ దాడిలో నారాయణకు మూగ దెబ్బలు తగలడంతో చికిత్స నిమిత్తం నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించారు. నారాయణ మరదలు శారద సైతం గాయపడింది. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు సుధాకర్‌రెడ్డి, శివరాజ్‌రెడ్డి, సురేష్‌తోపాటు పలువురు దవాఖానకు వెళ్లి పరామర్శించారు. సర్వే నంబర్ 53లో ఉన్న భూమి ని కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడంతోనే తమపై సర్పంచ్ వర్గీయులు దాడులకు పాల్పడినట్టు వారు ఆరోపించారు.