PM Tarique Rahman | మా రెండు షరతులకు అంగీకరిస్తేనే.. తారిక్ రహమాన్ ఇండియా పర్యటనపై బంగ్లాదేశ్ వింత వైఖరి
PM Tarique Rahman : బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ వచ్చే వారంలో ఇండియాలో పర్యటించాల్సి ఉంది. అయితే, ఈ పర్యటనపై బంగ్లాదేశ్ వైఖరి విచిత్రంగా ఉంది. తాము పెట్టిన రెండు షరతులకు అంగీకరిస్తేనే అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, అప్పుడే ఆయన ఇండియాలో పర్యటిస్తారని బంగ్లాదేశ్ ప్రకటించింది.
PM Tarique Rahman : బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ వచ్చే వారంలో ఇండియాలో పర్యటించాల్సి ఉంది. అయితే, ఈ పర్యటనపై బంగ్లాదేశ్ వైఖరి విచిత్రంగా ఉంది. తాము పెట్టిన రెండు షరతులకు అంగీకరిస్తేనే అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, అప్పుడే ఆయన ఇండియాలో పర్యటిస్తారని బంగ్లాదేశ్ ప్రకటించింది. బంగ్లాదేశ్ ప్రధానిగా ఈ ఏడాది తారిక్ రహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా ప్రధాని హోదాలో ఆయన ఇండియాలో పర్యటించాల్సి ఉంది.
ఈ మేరకు ఇండియా-బంగ్లాదేశ్ మధ్య చర్చలు జరిగాయి. ఆగష్టు 20-25 మధ్య తారిక్ రహమాన్ ఇండియాలో పర్యటిస్తారని సమాచారం. అయితే, ఈలోపే బంగ్లాదేశ్ ఒక మెలిక పెట్టింది. తమ రెండు షరతులకు అంగీకరిస్తేనే ఆయన ఇండియాలో పర్యటిస్తారని చెప్పింది. తమకు బంగ్లాదేశ్ ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యమని, తమ షరతులకు అంగీకరిస్తేనే అనుకూల వాతావరణం ఏర్పడుతుందని బంగ్లాదేశ్ పేర్కొంది. రెండు షరతుల్లో మొదటిది.. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగించడం. ఆమెతోపాటు ఇండియాలో ఆశ్రయం పొందుతున్న ఇతర బంగ్లా నేతల్ని కూడా అప్పగించాలని కోరుతోంది. రెండోది బంగ్లాదేశ్ ఉద్యమకారుడు షరీఫ్ ఒస్మాన్ హది హత్య ఘటనలో నిందితులు ఇండియాలోనే ఉన్నారని, వారిని కూడా అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేస్తోంది.
బంగ్లా ప్రధాని ఇండియాలో పర్యటించాలంటే ఈ రెండు షరతులకు ఇండియా అంగీకరించాలని డిమాండ్ చేస్తోంది. తమ దేశం పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోందని, అయితే బంగ్లా సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కోల్పోమని స్పష్టం చేసింది. ఇరు దేశాలు అంతర్గత విషయాల్లో బయటివారు జోక్యం చేసుకోకూడదనే అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చింది. అయితే, ఈ ప్రతిపాదనలపై ఇండియా ఇంకా స్పందించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

