FIH Hockey World Cup : ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ వరల్డ్‌కప్‌ను భారత జట్టు(Team India) డ్రాతో ఆరంభించింది. ఒలింపిక్ కాంస్య పతక విజేత చైనా(China)తో ఆదివారం హోరాహోరీ మ్యాచ్‌లో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా ఆఖర్లో పట్టుసడలించింది. పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకున్న చైనా 2-2తో స్కోర్ సమం చేసింది. దాంతో మన జట్టు గెలవాల్సిన మ్యాచ్ కాస్త డ్రాగా ముగిసింది. భారత్ తరఫున నవ్‌నీత్, దీపికలు చెరొక గోల్‌తో రాణించారు.
ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్‌కప్‌లో భారత పురుషుల జట్టు అదిరే బోణీ కొట్టగా.. మహిళలు మాత్రం డ్రాతో సరిపెట్టుకున్నారు. వాగ్నర్ హాకీ స్టేడియంలో ఆదివారం చైనాను నిలువరించడంలో విఫలమైన టీమిండియా 2-2తో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. మ్యాచ్ మొదలైన 8వ నిమిషంలోనే నేహ అందించిన పాస్‌ను నవ్‌నీత్ మెరుపు వేగంలో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పంపింది.
𝗔 𝗪𝗢𝗥𝗟𝗗 𝗖𝗨𝗣 𝗢𝗣𝗘𝗡𝗘𝗥 𝗙𝗨𝗟𝗟 𝗢𝗙 𝗙𝗜𝗚𝗛𝗧 𝗔𝗡𝗗 𝗖𝗛𝗔𝗥𝗔𝗖𝗧𝗘𝗥! 🇮🇳🏑🔥
The Indian Women’s Team showed immense fighting spirit and resilience to battle Olympic silver medallists China to a hard-fought 2-2 draw in their opening match of the FIH Hockey World… pic.twitter.com/USHmLCHUIg
— Hockey India (@TheHockeyIndia) August 16, 2026
అయితే.. 15వ నిమిషంలో ఝాంగ్ ఇంగ్ చైనాకు తొలి గోల్ అందించగా స్కోర్ 1-1తో సమం అయింది. రెండో అర్ధ భాగంలో దీపిక డ్రాగ్ ఫ్లిక్ గోల్‌తో ఆధిక్యంలో నిలిచిన భారత్ ఆపై బంతిపై నియంత్రణ కోల్పోయింది. పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకున్న చైనా 2-2తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.