Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
Ramayana | టాలీవుడ్లో సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటారు. గ్లామర్‌కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఎలాంటి పాత్రలో నటించినా అందులో సహజత్వం ఉండేలా చూసుకుంటారు.
Ramayana | టాలీవుడ్లో సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటారు. గ్లామర్‌కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఎలాంటి పాత్రలో నటించినా అందులో సహజత్వం ఉండేలా చూసుకుంటారు. అయితే ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో సీత పాత్రలో కనిపించిన సాయి పల్లవికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా ఆమె లుక్, స్టైలింగ్ విషయంలో కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ నెగిటివ్ కామెంట్స్‌పై సాయి పల్లవి స్పందించింది.
రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నితేశ్ తివారీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో సీత పాత్ర కోసం సాయి పల్లవిని ఎంపిక చేయడం అప్పట్లోనే ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే ఆమెకు సంబంధించిన లుక్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆమె రూపాన్ని, పాత్రకు తగ్గట్టుగా కనిపించడాన్ని ప్రశంసించగా, మరికొందరు స్టైలింగ్, కాస్ట్యూమ్స్ విషయంలో విమర్శలు చేశారు. ఈ విమర్శలు కొంతకాలం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పటివరకు ఈ నెగిటివ్ కామెంట్స్‌పై పెద్దగా స్పందించని సాయి పల్లవి.. తాజాగా తన అభిప్రాయాలను వెల్లడించింది.. బయటి వ్యక్తులు చేసే విమర్శలు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదని ఆమె పేర్కొంది. ప్రతి ఒక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుందని, వాటన్నింటినీ మనసుకు తీసుకుంటూ కూర్చుంటే ముందుకు సాగడం కష్టమని ఆమె అభిప్రాయపడింది. అనవసరమైన నెగిటివిటీని పక్కన పెట్టి, మనం చేయాల్సిన పనిపై దృష్టి పెట్టాలని ఆమె సూచించిందిది. ఒక నటిగా ప్రతి పాత్ర నుంచి కొత్త విషయాలను నేర్చుకోవడం ముఖ్యమని, విమర్శలను కూడా ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని సాయి పల్లవి భావిస్తుంది. ‘రామాయణ’లో సీత పాత్రలో నటించడం తనకు కేవలం ఒక సినిమా అనుభవం మాత్రమే కాదని, అది వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైన, ఆధ్యాత్మికమైన ప్రయాణమని సాయి పల్లవి పేర్కొంది. సీత వంటి గొప్ప పాత్రను తెరపై ఆవిష్కరించడం ఒక బాధ్యతతో కూడుకున్న విషయమని, ఆ పాత్రను అర్థం చేసుకోవడానికి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

