Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చివరి దశకు చేరుకుంటుండటంతో హౌస్‌లో ఆట మరింత ఆసక్తికరంగా మారుతోంది. రోజురోజుకూ కంటెస్టెంట్ల మధ్య పోటీ పెరుగుతుండగా, వ్యక్తిగత విభేదాలు, గొడవలు, ఎమోషనల్ సంఘటనలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్‌కు క్లాస్ తీసుకున్నారు.
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చివరి దశకు చేరుకుంటుండటంతో హౌస్‌లో ఆట మరింత ఆసక్తికరంగా మారుతోంది. రోజురోజుకూ కంటెస్టెంట్ల మధ్య పోటీ పెరుగుతుండగా, వ్యక్తిగత విభేదాలు, గొడవలు, ఎమోషనల్ సంఘటనలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్‌కు క్లాస్ తీసుకున్నారు. ముఖ్యంగా వర్షిణి, త్రిగుణ్, అమన్, ముఖేష్‌ల వ్యవహారంపై ఆయన సీరియస్‌గా స్పందించారు. హౌస్‌లో ప్రస్తుత పరిస్థితుల గురించి నాగార్జున అడిగిన ప్రశ్నకు వర్షిణి ఎమోషనల్‌గా స్పందించారు. హౌస్‌లో తొమ్మిది మంది ఒకవైపు, తాము ఇద్దరం మరోవైపు ఉన్నట్లు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సపోర్ట్ లభించడం లేదని, ముఖ్యంగా క్యారెక్టర్ విషయంలో తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు.
ఈ క్రమంలో త్రిగుణ్ తనను ‘చీప్ క్యారెక్టర్ నీది’ అని అన్నాడని వర్షిణి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ మాటలను త్రిగుణ్ ఏ ఉద్దేశంతో అన్నాడో వీడియో ఫుటేజ్ ద్వారా నాగార్జున వివరించారు. ఫ్రెండ్షిప్ విషయంలోనే ఆ వ్యాఖ్య చేశాడని, వర్షిణి అడిగిన వెంటనే తన ఉద్దేశాన్ని వివరించాడని నాగార్జున గుర్తుచేశారు. దీంతో వర్షిణి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అనంతరం త్రిగుణ్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన నాగార్జున.. ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలను తొలగించే ప్రయత్నం చేశారు. వర్షిణి గురించి ఆమెకు ఉన్న అభిప్రాయం ఎలాంటిదో, త్రిగుణ్‌కు కూడా ఆమెపై అలాంటి అభిప్రాయమే ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో వర్షిణికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలని త్రిగుణ్‌కు సూచించారు.
మరోవైపు కెప్టెన్ అమన్ వ్యవహారశైలిపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. కెప్టెన్ అయిన తర్వాత అమన్ ప్రవర్తనలో మార్పు వచ్చిందా? కంట్రోల్ తప్పుతున్నావా? అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి నిజమైన క్యారెక్టర్ అనేది బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు, ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు బయటపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖేష్‌తో అమన్ ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియోను చూపించారు. ముఖేష్‌ను పట్టుకుని ‘ఏంటి గబ్బు’ అంటూ మాట్లాడటంపై నాగార్జున నిలదీశారు. అయితే అమన్ తన వైపు వాదన వినిపిస్తూ.. పాలు వేడి చేసే సమయంలో జరిగిన ఘటన, ఆ తర్వాత ముఖేష్ తనను బ్రెయిన్లెస్ అని అన్న విషయాలను వివరించారు.
దీనిపై నాగార్జున స్పందిస్తూ కెప్టెన్ అంటే అధికారం కాదని, అదొక బాధ్యత అని స్పష్టం చేశారు. హౌస్‌లో ప్రతి ఒక్కరితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలని, ముఖ్యంగా ఎదుటివారి స్థాయిని, పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడాలని సూచించారు. ముఖేష్ వ్యవహారశైలిపై కూడా నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖేష్‌కు మంచి గుర్తింపు, స్టార్డమ్ ఉన్నాయని చెబుతూ.. అతడి ప్రవర్తన వల్ల అభిమానుల్లో ఉన్న అభిమానం తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. త్రిగుణ్‌తో ముఖేష్‌కు ఉన్న విభేదాల గురించి కూడా ప్రశ్నించారు.
ముఖేష్ బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసిన ఘటనపై వర్షిణిని వివరణ అడిగారు. తన బట్టలు కూడా అందులో ఉన్నాయని, 24 గంటలు కూడా గడవకముందే వాటిని పడేశారని ఆమె చెప్పారు. ఈ విషయంలో ముఖేష్ తన ప్రవర్తనను మార్చుకోవాలని నాగార్జున సూచించారు. ఎంతమంది అభిమానులు ఉన్నప్పటికీ, హౌస్‌లో ప్రవర్తించే తీరు కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. ఇక స్నేక్ టాస్క్, బాస్కెట్ టాస్క్‌లలో జరిగిన తప్పులపై కూడా నాగార్జున క్లారిటీ ఇచ్చారు. స్నేక్ టాస్క్‌లో త్రిగుణ్ బాగా ఆడాడని అమన్ చెప్పగా, మరి గెలిచింది ఆర్కే ఎలా అని నాగార్జున ప్రశ్నించారు. బాక్స్ కింద పడిన తర్వాతే దాన్ని తీసుకోవాల్సి ఉంటుందని వీడియో ఆధారంగా వివరించారు.
అలాగే బాస్కెట్లో బాల్‌ను కాపాడుకునే విషయంలో జరిగిన వివాదంపై కూడా చర్చించారు. ఆర్కే తన వాదన వినిపించగా, వర్షిణిని సంచాలక్‌గా ఉంటే ఎలాంటి నిర్ణయం తీసుకునేదని నాగార్జున అడిగారు. బాస్కెట్‌ను లాగడం మాత్రం ఫౌల్‌గా పరిగణిస్తానని వర్షిణి సమాధానం ఇచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aman
- bigg boss 10
- Nagarjuna
- Pavitra
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
RTC Merger | అటకెక్కిన ఆర్టీసీ విలీనం.. మూడేండ్లు కావొస్తున్నా నెరవేరని హామీ!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

