Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు రామ్ చరణ్ కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు రామ్ చరణ్ కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం ఘనంగా జరగగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోందట.
ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ కథ, స్క్రిప్ట్‌ను మరింత పకడ్బందీగా సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నటీనటుల ఎంపిక, టెక్నికల్ టీమ్ ఎంపికతో పాటు సినిమాకు సంబంధించిన ఇతర కీలక పనులను కూడా పూర్తి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. షూటింగ్ ప్రారంభానికి ముందే అన్ని విభాగాలను సిద్ధం చేసుకుని సెట్స్‌పైకి వెళ్లాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త రిలీజ్ డేట్‌కు సంబంధించినది. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే చిత్ర బృందం విడుదల తేదీ విషయంలో ఒక ప్రాథమిక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం RC17 సినిమాను 2028 మే నెలలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
అయితే దీనిపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ రిలీజ్ డేట్ వార్త వైరల్ అవుతోంది. రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో విడుదల తేదీపై వస్తున్న వార్తలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. సుకుమార్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్, కథనం, టేకింగ్ ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్‌ను పూర్తిగా కొత్త కోణంలో చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు RC17 కోసం కూడా మెగా పవర్ స్టార్‌ను సరికొత్త లుక్, భిన్నమైన పాత్రలో చూపించేందుకు దర్శకుడు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సారి కథ, కథనం విషయంలో మరింత ప్రత్యేకత ఉండేలా సుకుమార్ కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, సినిమాకు అవసరమైనంత సమయం తీసుకుని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

