Watch: డిపో నుంచి కొత్త ఆర్టీసీ బస్సు చోరీ.. తర్వాత ఏం జరిగిందంటే?
New RTC Bus Stolen | ఆర్టీసీకి చెందిన కొత్త బస్సు డిపో నుంచి చోరీ అయ్యింది. దొంగలు దర్జాగా దానిని డ్రైవ్ చేసుకుని తీసుకెళ్లారు. కొంతదూరం ప్రయాణించిన తర్వాత టైర్ పంక్చర్ కావడంతో ఆ బస్సును వదిలేసి వెళ్లిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు షాక్ అయ్యారు.
ముంబై: ఆర్టీసీకి చెందిన కొత్త బస్సు డిపో నుంచి చోరీ అయ్యింది. దొంగలు దర్జాగా దానిని డ్రైవ్ చేసుకుని తీసుకెళ్లారు. కొంతదూరం ప్రయాణించిన తర్వాత టైర్ పంక్చర్ కావడంతో ఆ బస్సును వదిలేసి వెళ్లిపోయారు. ( New RTC Bus Stolen) ఈ సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు షాక్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ)కు చెందిన కొత్త బస్సును జమ్నేర్ ఎస్టీ డిపోలో నిలిపి ఉంచారు.
కాగా, సోమవారం అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు ఆ డిపోలోకి చొరబడ్డారు. పార్క్ చేసిన కొత్త ఆర్టీసీ బస్సును చోరీ చేశారు. దానిని నడుపుతూ డిపో నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే కొంతదూరం ప్రయాణించిన తర్వాత ఆ కొత్త బస్సు టైర్ పంక్చర్ అయ్యింది. ఈ నేపథ్యంలో దొంగలు ఒక గ్రామం వద్ద బస్సును వదిలేసి వెళ్లిపోయారు.
మరోవైపు డిపో నుంచి కొత్త బస్సు మాయమైనట్లు తెలుసుకుని ఆర్టీసీ అధికారులు షాక్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా కొందరు వ్యక్తులు ఆ బస్సును చోరీ చేయడాన్ని గమనించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఆ బస్ డిపో నుంచి కొత్త ఆర్టీసీ బస్సు చోరీ కావడంతో అక్కడి భద్రతా లోపాలపై విమర్శలు వెల్లువెత్తాయి. దొంగలు ఆ డిపో నుంచి కొత్త బస్సును ఎలా బయటకు తీసుకెళ్లగలిగారు, వారిని ఎవరూ ఎందుకు అడ్డుకోలేదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ అధికారులు దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నారు. కాగా, డిపో నుంచి కొత్త బస్సు చోరీకి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Jalgaon : Thieves allegedly attempted to steal an MSRTC bus from Jamner depot. The bus was driven towards Shahapur but was abandoned. The suspects fled the spot, leaving the bus behind. CCTV footage captured the theft attempt.
#Maharashtra #MSRTC #CCTVFootage #MaharashtraNews pic.twitter.com/R4Zo9Jlfkl— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) August 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- abandon
- Depot
- Maharashtra
- New
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

