Watch: లిఫ్ట్‌లో తలెత్తిన సమస్య.. వ్యక్తికి తృటిలో తప్పిన ముప్పు
Gujarat Man Escapes From Lift | ఒక బిల్డింగ్‌లోని లిఫ్ట్‌లో సమస్య తలెత్తింది. అందులో ఉన్న వ్యక్తి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. లిఫ్ట్ డోర్ తెరుచుకున్నప్పటికీ అది కదిలింది. అయితే ఆ వ్యక్తికి తృటిలో ప్రమాదం తప్పింది.
అహ్మదాబాద్: ఒక బిల్డింగ్‌లోని లిఫ్ట్‌లో సమస్య తలెత్తింది. అందులో ఉన్న వ్యక్తి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. లిఫ్ట్ డోర్ తెరుచుకున్నప్పటికీ అది కదిలింది. అయితే ఆ వ్యక్తికి తృటిలో ప్రమాదం తప్పింది. (Gujarat Man Escapes From Lift) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లోని వల్సాద్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో తితాల్ రోడ్డులో ఉన్న సబర్మతి భవనంలోని లిఫ్ట్‌లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. పై అంతస్తులోకి వెళ్లేందుకు బటన్ నొక్కాడు.
కాగా, కొన్ని సెకండ్ల వరకు ఆ లిఫ్ట్ కదలలేదు. 39 సెకన్ల తర్వాత లిఫ్ట్ డోర్ అకస్మాత్తుగా తెరుచుకున్నది. దీంతో లిఫ్ట్‌లో సమస్య ఉన్నట్లు ఆ వ్యక్తి గుర్తించాడు. త్వరగా బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు ఉన్నట్టుండి ఆ లిఫ్ట్ కదిలింది. డోర్ తెరిచి ఉనప్పటికీ కింద వైపు వెళ్లింది. కొన్ని సెకన్ల తర్వాత ఆగిపోయింది. మళ్లీ లిఫ్ట్ తలుపులు మూసుకుని కిందకు దూసుకెళ్లింది. పెద్ద శబ్దం రావడంతో నివాసితులు భయాందోళన చెందారు. ఆ లిఫ్ట్ వద్దకు చేరుకున్నారు.
అయితే లిఫ్ట్ నుంచి తృటిలో బయటపడిన ఆ వ్యక్తికి ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊరట చెందారు. లిఫ్ట్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
दिल देहलदेने वाला वलसाड का यह वीडियो लिफ्ट के रखरखाव की कमी को उजागर करता है। दरअसल, गुजरात की कई पुरानी सोसायटीज में खस्ता हाल में ही लिफ्ट चल रही है। जो कभी भी मौत को बुलावा दे सकती है। @sanghaviharsh pic.twitter.com/T5vK4tBuhq
— Dixit Soni (@DixitGujarat) March 3, 2026
Also Read:
Watch: చాలా దూరం కారును ఈడ్చుకెళ్లిన లారీ.. షాకింగ్ వీడియో వైరల్
Watch: బావిలో పడిన మేక పిల్ల.. కాపాడేందుకు సాహసం చేసిన బాలుడు
techie dies by suicide | వంట విషయంలో అత్తతో గొడవ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

