techie dies by suicide | వంట విషయంలో అత్తతో గొడవ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
techie dies by suicide | వంట విషయంలో అత్తతో గొడవ జరిగింది. తనను వంట చేయనీయడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వారు తమ కుమార్తెను వరకట్నం కోసం వేధిస్తున్నట్లు ఆమె కుటుంబం ఫిర్యాదు చేసింది.
బెంగళూరు: వంట విషయంలో అత్తతో గొడవ జరిగింది. తనను వంట చేయనీయడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వారు తమ కుమార్తెను వరకట్నం కోసం వేధిస్తున్నట్లు ఆమె కుటుంబం ఫిర్యాదు చేసింది. (techie dies by suicide) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల సుష్మ గతంలో అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలో పనిచేసింది. ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన పునీత్ కుమార్తో ఆమెకు పెళ్లి జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
కాగా, సుష్మ, ఆమె అత్త మధ్య చిన్న చిన్న విషయాలకే తరచుగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వంట చేయడంపై వారిద్దరి మధ్య వివాదం జరిగింది. సుష్మ వంట చేయడాన్ని ఆమె అత్త అనుమతించలేదు. ఈ నేపథ్యంలో అత్త వారింట్లో వేధింపులు తాళలేక సుష్మ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మరోవైపు చిన్న చిన్న విషయాలకే గొడవలతోపాటు వరకట్నం కోసం తమ కుమార్తెను అత్తింటి వారు వేధించినట్లు సుష్మ కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో భర్త పునీత్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. అత్త కల్పన ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. సుష్మ ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Bengaluru techie dies by suicide | వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య
Couple’s Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే విడిపోయిన జంట.. ఎందుకంటే?
Watch: బావిలో పడిన మేక పిల్ల.. కాపాడేందుకు సాహసం చేసిన బాలుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

