గేమింగ్, ఫ్లాగ్షిప్ పెర్ఫార్మెన్స్ కోరుకునే నేటితరం కోసం.. ప్రముఖ ఐక్యూ సంస్థ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. ‘నియో’ సిరీస్‌లో భాగంగా.. ‘11 అల్ట్రా’ మాడల్‌ను తాజాగా పరిచయం చేసింది. బ్యాటరీకి పెద్దపీట పేస్తూ ఈ ఫోన్‌ను తీర్చిదిద్దింది. ఐక్యూ అధికారిక సమాచారం ప్రకారం.. ఇందులో 9,100 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఏర్పాటుచేశారు. దీనిని చార్జ్ చేయడానికి.. 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ-9500 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 4.21GHz వరకూ క్లాక్ స్పీడ్‌ను అందుకోగల ప్రైమ్కోర్ ఉంటుంది. 16జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్ ఉండటం వల్ల.. గేమింగ్, మల్టీ టాస్కింగ్ వేగంగా, ఎలాంటి ల్యాగ్ లేకుండా సాగుతాయి. గేమర్లకు అనుకూలంగా ఉండే.. ఫ్లాట్ ఎడ్జెస్‌తో కూడిన 6.83 అంగుళాల 2కె OLED స్క్రీన్ ఉన్నది.
ఇది కంటి రక్షణ కోసం 2,160Hz పీడబ్ల్యూఎం డిమ్మింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫొటోలు, వీడియోల కోసం ఓఎస్ఎస్ సపోర్ట్ అందించే 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా సెటప్‌ను ఏర్పాటుచేశారు. మెటల్ ఫ్రేమ్‌తో తయారైన ఈ ఫోన్.. ఐపీ 68/ఐపీ 69 రేటింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. నీరు, ధూళి నుంచి రక్షణ కల్పిస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉన్నది. బేస్ వేరియంట్ ధర రూ.41,000గా ఉండబోతున్న ఐక్యూ నియో 11 అల్ట్రా.. త్వరలోనే మార్కెట్లో విడుదల కానున్నది.