న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను రాష్ట్రపతి ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ పాలన కింద ఉన్న చండీగఢ్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 కిందకు తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది. (Chandigarh Bill Row) ఈ మేరకు రాజ్యాంగ సవరణకు సంబంధించిన చండీగఢ్ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
కాగా, పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేతలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పంజాబ్, హర్యానాకు ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్ కేవలం పంజాబ్‌కే చెందుతుందని అన్నారు. పంజాబ్ నుంచి చండీగఢ్‌ను వేరు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని ఆ పార్టీల నేతలు ఆరోపించారు.
మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. చండీగఢ్ బిల్లుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ‘కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌కు చట్టాలను సులభతరం చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. తుది నిర్ణయం తీసుకోలేదు. చండీగఢ్ పరిపాలన లేదా పంజాబ్ లేదా హర్యానాతో దాని సాంప్రదాయ సంబంధాల గురించి ఈ ప్రతిపాదనలో ఏమీ లేదు. అందరిని సంప్రదించిన తర్వాత చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చండీగఢ్ విషయంలో ఎలాంటి బిల్లును తీసుకురావాలని కేంద్రం యోచించడం లేదు’ అని ఎక్స్‌లో పేర్కొంది.
संघ राज्य क्षेत्र चंडीगढ़ के लिए सिर्फ केंद्र सरकार द्वारा कानून बनाने की प्रक्रिया को सरल बनाने का प्रस्ताव अभी केंद्र सरकार के स्तर पर विचाराधीन है| इस प्रस्ताव पर कोई अंतिम निर्णय नहीं लिया गया है| इस प्रस्ताव में किसी भी तरह से चंडीगढ़ की शासन-प्रशासन की व्यवस्था या चंडीगढ़…
— PIB – Ministry of Home Affairs (@PIBHomeAffairs) November 23, 2025
Also Read:
Watch: ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్లపై కుక్కలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: మినీ లారీని ఢీకొట్టిన వాహనం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: కదులుతున్న రైలులో నూడుల్స్ వండిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?