Watch: ప్రియుడ్ని విడుదల చేయాలంటూ మొబైల్ టవర్ ఎక్కిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman climbs mobile tower | ఒక మహిళ అదృశ్యం కావడంతో ఆమె కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో మహిళ ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలుసుకున్న ఆమె మొబైల్ టవర్ ఎక్కింది. ప్రియుడ్ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె ప్రియుడిని అక్కడకు తీసుకువచ్చారు.
పాట్నా: ఒక మహిళ అదృశ్యం కావడంతో ఆమె కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో మహిళ ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలుసుకున్న ఆమె మొబైల్ టవర్ ఎక్కింది. (Woman climbs mobile tower) ప్రియుడ్ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె ప్రియుడిని అక్కడకు తీసుకువచ్చారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బంకట జాగిర్దారి గ్రామానికి చెందిన ఒక మహిళ, పవన్ చౌహాన్ ప్రేమించుకున్నారు. అయితే మార్చి 5న ఆ మహిళ అదృశ్యమైంది. ప్రియుడు పవన్ కిడ్నాప్ చేసినట్లు ఆమె కుటుంబం అనుమానించింది. పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ మొబైల్ టవర్ ఎక్కింది. తన ప్రియుడ్ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేకపోతే అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.
మరోవైపు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో అదుపులోకి తీసుకున్న పవన్‌ను అక్కడకు తీసుకువచ్చారు. ఫోన్లో ఆమెతో మాట్లాడించారు. దీంతో ఆ మహిళ మొబైల్ టవర్ నుంచి కిందకు దిగింది.
ఈ సంఘటనపై తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. అయితే సినిమా సీన్‌ను తలపించిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨A woman climbing a mobile tower in Bihar’s Gopalganj, demands a boyfriend’s release. Police bring the arrested boyfriend to the spot to calm the situation. Video goes viral, sparks mixed reactions. #Gopalganj #ViralMoment #WomensDay pic.twitter.com/wRoQKFQ5xG
— indiainlast24hr (@indiain24hr) March 8, 2026
Also Read:
Man cuts off mother-in-law’s nose | అత్త ముక్కు కోసిన అల్లుడు.. తెగిన ముక్కు భాగంతో పరార్
Illegal Opium Cultivation | ఫార్మ్‌హౌస్‌లో నల్లమందు సాగు.. బీజేపీ నేత సస్పెండ్
Old Woman Gang Raped | 90 ఏళ్ల వృద్ధురాలిపై.. ముసుగులు ధరించిన నలుగురు సామూహిక అత్యాచారం
man stabs twin sister | ఇన్స్టాగ్రామ్ యువతితో బ్రేకప్.. కవల సోదరి, తల్లిపై కత్తితో వ్యక్తి దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

