Illegal Opium Cultivation | ఫార్మ్‌హౌస్‌లో నల్లమందు సాగు.. బీజేపీ నేత సస్పెండ్
Illegal Opium Cultivation | బీజేపీ నేత తన ఫార్మ్‌హౌస్‌లో అక్రమంగా నల్లమందు సాగు చేస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రైడ్ చేశారు. బీజేపీ నేతతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
రాయ్‌పూర్: బీజేపీ నేత తన ఫార్మ్‌హౌస్‌లో అక్రమంగా నల్లమందు సాగు చేస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రైడ్ చేశారు. బీజేపీ నేతతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. (Illegal Opium Cultivation) ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. స్థానిక బీజేపీ నేత, బీజేపీ కిసాన్ మోర్చా రైస్ మిల్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ రాష్ట్ర కన్వీనర్ వినయ్ తామ్రాకర్కు సమోదా గ్రామంలో ఫామ్‌హౌస్ ఉన్నది. అందులో రహస్యంగా నల్లమందు అక్రమంగా సాగుచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వినయ్‌తో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
కాగా, పార్టీ ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగినట్లు బీజేపీ పేర్కొంది. రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ సింగ్ డియో సూచనల మేరకు వినయ్ తామ్రాకర్‌ను సంస్థాగత పదవి నుంచి తొలగించింది. అలాగే ఆయన అరెస్ట్, కేసుపై దర్యాప్తు నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం మార్చి 7న సస్పెన్షన్ ఉత్తర్వు జారీ చేసింది.
మరోవైపు సమోదాలోని ఆ ఫార్మ్‌హౌస్‌ను మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ సందర్శించారు. సుమారు 150 ఎకరాల మేర విస్తరించి ఉన్నదని తెలిపారు. నిందితులకు శక్తివంతమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయని బాఘేల్ ఆరోపించారు. ఈ అక్రమ నల్లమందు సాగులో ఏ మంత్రులు, ఎమ్మెల్యేలకు పాత్ర ఉన్నదో బీజేపీ ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడటంతో పోలీసులను మోహరించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
Also Read:
Cracks on Gujarat bridge | గుజరాత్లో వంతెనకు పగుళ్లు.. వాహనదారులు, స్థానికులు ఆందోళన
Old Woman Gang Raped | 90 ఏళ్ల వృద్ధురాలిపై.. ముసుగులు ధరించిన నలుగురు సామూహిక అత్యాచారం
man stabs twin sister | ఇన్స్టాగ్రామ్ యువతితో బ్రేకప్.. కవల సోదరి, తల్లిపై కత్తితో వ్యక్తి దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

