అహ్మదాబాద్: కొత్తగా నిర్మించిన బ్రిడ్జి పగుళ్లిచ్చింది. ఐదారు అంగుళాల వెడల్పు, 50 మీటర్ల పొడవున పగుళ్లు ఏర్పడ్డాయి. (Cracks on Gujarat bridge) దీంతో వాహనదారులతో పాటు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భావ్‌నగర్-సోమ్‌నాథ్ జాతీయ రహదారిపై కొత్తగా నిర్మించిన వంతెనపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఇది చూసి వాహనదారులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
కాగా, భావ్నగర్ను ద్వారకా నుంచి సోమనాథ్ కలిపే జాతీయ రహదారి 51లోని ఈ వంతెన నిర్మాణ పనులను 2014లో చేపట్టారు. 2024లో ఈ బ్రిడ్జీని ప్రారంభించారు. అయితే ఏడాదిన్నరకే వంతెనపై పగుళ్లు ఏర్పడ్డాయని స్థానికులు ఆరోపించారు. పదేపదే ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read:
Old Woman Gang Raped | 90 ఏళ్ల వృద్ధురాలిపై.. ముసుగులు ధరించిన నలుగురు సామూహిక అత్యాచారం
man stabs twin sister | ఇన్స్టాగ్రామ్ యువతితో బ్రేకప్.. కవల సోదరి, తల్లిపై కత్తితో వ్యక్తి దాడి
Watch: విద్యార్థులతో ప్రధానోపాధ్యాయురాలు మసాజ్.. వీడియో వైరల్‌తో సస్పెండ్