US Tariff Bill | అమెరికా రష్యాపై ఆంక్షల బిల్లు.. భారత్, చైనాలపై సుంకాల చిల్లు
US Tariff Bill | రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల బిల్లును అమెరికా సెనెట్‌లో ప్రవేశ పెట్టారు. ఆ దేశాల నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం సుంకాలు విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది.
US Tariff Bill | రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల బిల్లును అమెరికా సెనెట్‌లో ప్రవేశ పెట్టారు. ఆ దేశాల నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం సుంకాలు విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. దివంగత నెటర్ లిండ్సే గ్రాహం ఈ బిల్లును రూపొందించారు. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై ఆంక్షలు, ఇరాన్‌పై జరిమానాలు విధించడమే ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లుకు సెనెట్‌లో 86 ఓట్లు అనుకూలంగా, 12 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో బిల్లును ఆ దేశ మద్దతు కోరుతున్న అమెరికా సెనెట్‌లో ప్రవేశపెట్టడం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణను లిండ్సే గ్రాహం వ్యతిరేకించారు. ఆయనకు నివాళిగా ఈ బిల్లును సెనెట్‌లో ప్రవేశ పెట్టారు. అందుకే ఈ బిల్లుకు లిండ్సే గ్రాహమ్ (Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026) పేరు పెట్టారు.
ఇంధన ఎగుమతుల ద్వారా రష్యా ఆర్జిస్తున్న ఆదాయాన్ని కట్టడి చేసేందుకు, ఇరాన్‌పై చర్యలు తీసుకునేందుకు ట్రంప్‌నకు అవకాశం ఈ బిల్లు కల్పిస్తుంది. ప్రతినిధుల సభ (House of Representatives) కూడా ఆమోదిస్తే ఈ బిల్లు చట్టంగా మారుతుంది. అదే జరిగితే భారత్, చైనాతో సహా ప్రధాన దేశాలు వంద శాతం టారిఫ్‌ను ఎదుర్కోవాల్సి
ఉంటుంది. ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంకాలు విధిస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | విదేశీ బొగ్గులో.. 3 వేల కోట్ల సామ్.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ!
Revanth Reddy | రైతులు పంటలు వెయ్యొద్దు.. వద్దన్నా పంటలు వేస్తామంటే మీ కర్మ.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 16-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
మహా విపత్తు… ముంచుకొస్తున్న నీటి ముప్పు
26న కృష్ణా బోర్డు మీటింగ్.. ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

