Ramana Nadana | యూట్యూబర్ దంపతులపై బాధితుల ఫిర్యాదులు .. రమా నందన్లకి బిగిస్తున్న ఉచ్చు
Ramana Nadana | విదేశాల్లో ఉద్యోగం సంపాదించి మంచి జీతంతో స్థిరపడాలనే యువత ఆశలను కొందరు మోసగాళ్లు తమకు అవకాశంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులు, విదేశాల్లో ఉన్న వారిని మోసం చేశారనే ఆరోపణలు యూట్యూబర్ రమా నందన, ఆమె భర్త మధుకర్‌పై వచ్చాయి. సోషల్ మీడియాలో ‘నందూస్ వరల్డ్’ పేరుతో గుర్తింపు పొందిన ఈ దంపతులపై పలువురు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు.
Ramana Nadana | విదేశాల్లో ఉద్యోగం సంపాదించి మంచి జీతంతో స్థిరపడాలనే యువత ఆశలను కొందరు మోసగాళ్లు తమకు అవకాశంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులు, విదేశాల్లో ఉన్న వారిని మోసం చేశారనే ఆరోపణలు యూట్యూబర్ రమా నందన, ఆమె భర్త మధుకర్‌పై వచ్చాయి. సోషల్ మీడియాలో ‘నందూస్ వరల్డ్’ పేరుతో గుర్తింపు పొందిన ఈ దంపతులపై పలువురు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు.యూకేలో ఉద్యోగాలు ఇప్పించడంతో పాటు ఉద్యోగ వీసాలు కూడా ఇప్పిస్తామని నమ్మించి తమ వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు తీసుకున్నారని వారు పేర్కొంటున్నారు.
తమ కన్సల్టెన్సీ సంస్థకు యూకే ప్రభుత్వం ఉద్యోగులను నియమించుకునేందుకు అనుమతి ఇచ్చిందని చెప్పి తమను నమ్మించారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్, విజిటర్ వీసాలపై యూకే వెళ్లి, వీసా గడువు ముగిసే దశలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారికి ఉద్యోగం కల్పించడంతో పాటు ఉద్యోగ వీసా ఇప్పిస్తామని హామీ ఇచ్చి డబ్బులు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. అయితే అనంతరం కన్సల్టెన్సీ తరఫున సమర్పించిన కొన్ని పత్రాలు నకిలీవిగా తేలడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధితులు తెలంగాణలోని వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర ప్రాంతాల్లో ఉన్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నట్లు సమాచారం. తమ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లిన తమ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై పలువురు బాధితులు హైదరాబాద్ బేగంపేటలోని జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన సీఎం ప్రజావాణిని ఆశ్రయించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు, ప్రజావాణి ఇన్‌ఛార్జి గద్వాల విజయలక్ష్మి, నోడల్ అధికారి విద్యాసాగర్, ఎన్ఆర్ఐ సలహా కమిటీ ఛైర్మన్ డా. వినోద్‌కుమార్‌లను కలిసి తమ సమస్యను వివరించినట్లు తెలుస్తోంది. యూకే ఉద్యోగాలు, వీసాల పేరుతో తమ నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఆరోపిస్తూ దంపతులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు పోలీసులను కూడా ఆశ్రయించినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన ప్రజావాణి అధికారులు ఈ అంశంపై రాష్ట్ర డీజీపీతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో వాస్తవంగా ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేశారు? కన్సల్టెన్సీ సమర్పించిన పత్రాల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా? అనే అంశాలపై అధికారిక దర్యాప్తు పూర్తయితేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Police
- rama nandan
- Youtuber
RELATED ARTICLES
తాజా వార్తలు
వాయు కాలుష్య నివారణలో అట్టడుగున భారత్
ఇరాన్‌పైకి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’!
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

