Actor Suman | సినిమాల్లో పెరుగుతున్న అసభ్యత మరియు వల్గారిటీపై ప్రముఖ నటుడు సుమన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్న ఈ అశ్లీలత సెన్సార్ బోర్డు అధికారులకు ఎందుకు కనిపించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఇటీవల కాలంలో విడుదలయిన కొన్ని చిత్రాలు(టాక్సిక్ని ఉద్దేశించి) చర్చనీయాంశంగా మారిన సినిమాలపై పరోక్షంగా స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వస్తున్న పలు చిత్రాలు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి చూసే విధంగా లేవని, ఇది సమాజంపై, ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుమన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా సెన్సార్ బోర్డు తన వైఖరిని మార్చుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కళాత్మక స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటి ప్రదర్శిస్తున్న అశ్లీలతను అరికట్టాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డుపైనే ఉందని స్పష్టం చేశారు.