Sonu Sood | తన పేరుతో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్.. అభిమానికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన సోనూ సూద్!
Sonu Sood Surprises Vijayawada Fan | ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడూ ముందుండి సాయం చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
Sonu Sood Surprises Vijayawada Fan | ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడూ ముందుండి సాయం చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. విజయవాడ నగరంలో తనపై ఉన్న అంతులేని అభిమానంతో ఓ యువకుడు తన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు సోనూ సూద్ పేరు పెట్టుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా సోనూ సూద్ దృష్టికి వెళ్లడంతో, ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు.
అతడి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి ఆ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను సందర్శించి అభిమానికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తనని స్వయంగా చూడటంతో ఆ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ యజమాని మరియు అభిమాని ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. సోనూ సూద్ అక్కడికి వచ్చి కాసేపు ముచ్చటించి, ఫాస్ట్‌ఫుడ్ రుచి చూస్తూ ఫోటోలు దిగారు. ఈ అరుదైన దృశ్యాలను చూసేందుకు స్థానికులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. రియల్ హీరో ఎలాంటి గర్వం లేకుండా సామాన్య అభిమాని వద్దకు వెళ్లి కలిసిన తీరు చూసి నెటిజన్లు, ప్రజలు సోనూ సూద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
విజయవాడలో తనపై ఉన్న అభిమానంతో సోనూ సూద్ పేరుతో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేసిన ఓ అభిమానికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు సోనూ సూద్. విషయం తెలుసుకున్న ఆయన స్వయంగా అక్కడికి వెళ్లి అభిమానిని కలుసుకున్నారు. #SonuSood pic.twitter.com/pSybR6ukFe
— Sai Satish (@PROSaiSatish) September 20, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

