జూరాల ముట్టడికి బీఆర్ఎస్ పిలుపు.. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ముందస్తు అరెస్టు
జూరాల ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జూరాల ప్రాజెక్టు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వనపర్తిలో గృహనిర్బంధంలో ఉంచారు.
జూరాల ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జూరాల ప్రాజెక్టు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వనపర్తిలో గృహనిర్బంధంలో ఉంచారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పలుచోట్ల ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు.
వనపర్తి, ఆత్మకూర్, అమరచింత, నర్వ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు. జూరాల ప్రాజెక్టు వైపు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.
జూరాల ప్రాజెక్టును పోలీసులు పూర్తిగా దిగ్బంధించారు. ఆనకట్ట పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అనుమానితులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని జూరాల వైపు రాకుండా కట్టడి చేస్తున్నారు. ముట్టడి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇళ్ల వద్ద ఇంటెలిజెన్స్ పోలీసులను కూడా రంగంలోకి దించారు. దీంతో జూరాల ప్రాజెక్టు పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గద్వాలలోనూ రైతుల ఆందోళన
గద్వాలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

