Nitish Setu | నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం.. బ్యానర్లు ధ్వంసం
Nitish Setu | బీహార్‌లోని వైశాలిలో నిర్మించిన ఆరు లేన్ల వంతెనకు మాజీ సీఎం పేరుతో నితీశ్ సేతు అని పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం దీనిని ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కార్యకర్తలు ఆ బ్రిడ్జి పైకి చేరుకుని గందరగోళం సృష్టించారు.
పాట్నా: బీహార్‌లోని వైశాలిలో నిర్మించిన ఆరు లేన్ల వంతెనకు మాజీ సీఎం పేరుతో నితీశ్ సేతు అని పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం దీనిని ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కార్యకర్తలు ఆ బ్రిడ్జి పైకి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, ఎన్డీఏ ప్రభుత్వానికి చెందిన బ్యానర్లను చించివేయడంతో పాటు గందరగోళం సృష్టించారు. ఆర్జేడీ జెండాలు ఊపడంతో పాటు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లకు మద్దతుగా నినాదాలు చేశారు. సుమారు 40 నిమిషాల పాటు కొత్త వంతెనపై హంగామా చేస్తూ అంతరాయం సృష్టించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, బీహార్‌లోని అధికార బీజేపీ దీనిపై మండిపడింది. ప్రభుత్వం అభివృద్ధిని చేపడుతుంటే, ప్రతిపక్ష ఆర్జేడీ మాత్రం అంతరాయం కలిగిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తోందని బీజేపీ ప్రతినిధి నీరజ్ కుమార్ శర్మ ఆరోపించారు.
మరోవైపు ఆర్జేడీ కార్యకర్తల చర్యను ఆ పార్టీ ఎంపీ సుధాకర్ సింగ్ సమర్థించారు. ఆ వంతెనకు ఇప్పటికే ప్రారంభోత్సవం జరిగిందని, కేవలం పేరు మార్చడం కోసం రెండోసారి వేడుక నిర్వహించి కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘జరిగింది ఒక నిరసన మాత్రమే. అలా చేసిన వారు సరైన పనే చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన పోస్టర్లు, బ్యానర్లను ‘మోసపూరిత పద్ధతిలో’ పెట్టారు’ అని ఆయన విమర్శించారు.
RJD WORKERS CREATE CHAOS ON NITISH SETU
Chaos erupted on Bihar’s newly inaugurated Nitish Setu hours after Prime Minister Narendra Modi opened the six-lane bridge in Vaishali on Saturday, with RJD supporters tearing down NDA posters and banners and raising slogans backing Lalu Prasad Yadav and Tejashwi Yadav.
Videos circulating on social media show supporters waving party flags, pulling down posters and crowding the bridge, with many riding motorcycles. Police personnel were seen alongside the crowd as the disruption continued for nearly 40 minutes.
The incident triggered a political confrontation, with BJP spokesperson Neeraj Kumar Sharma accusing the RJD of indulging in political theatrics instead of welcoming development projects.
#BiharPolitics #RJD #BJP #NitishSetu #TejashwiYadav #NarendraModi
https://t.co/E6eMdaPYbv— Diganta Guha (@diganta_guha) November 22, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Setu | నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం.. బ్యానర్లు ధ్వంసం
The Lakshmana | వెండితెరపై లక్ష్మణుడి అజ్ఞాత వీరగాథ.. ఆకట్టుకుంటున్న ‘ది లక్ష్మణ’ ఫస్ట్ లుక్ పోస్టర్!
Mallu Ravi | ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారు : మల్లు రవి
YSRCP | టీడీపీ ఎమ్మెల్యే జయరాం వర్గీయుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

