Mallu Ravi | ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారు : మల్లు రవి
Mallu Ravi | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిలపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ వేటు వేస్తుందా.. అంటూ చర్చలు నడుస్తుండగా.. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లురవి కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Mallu Ravi | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎప్పటికపుడు కాంగ్రెస్ సర్కార్‌పై ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారని తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ వేటు వేస్తుందా.. అంటూ చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లురవి కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా మల్లురవి నన్ను చాలా మంది అడుగుతున్నారు..ఈ మధ్య ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖను దాటి మాట్లాడినట్టుగా చాలా ఫిర్యాదులు నా దగ్గరకు వచ్చాయి. ఈ విషయాన్ని మేం పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌తో మాట్లాడాం.. పీసీసీ అధ్యక్షుడు ఈ విషయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోజు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్ జరుగుతుంది.. అందులో ఏఐసీసీ సెక్రటరీ సందీప్ మన రాష్ట్రానికి ఇన్ చార్జ్‌గా వచ్చారు.. ఆయన స్వయంగా వారితో మాట్లాడుతూ.. మీటింగ్‌లో కూడా ఈ విషయాల మీద మాట్లాడి భవిష్యత్‌లో పార్టీకి నష్టం జరిగే విధంగా ఎవరూ మాట్లాడకుండా చూసేందుకు నిర్ణయాలుండబోతున్నాయన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలపై నేడు చర్యలు తీసుకునే అవకాశం
ఈ రోజు చర్యలు ఉంటాయని అచ్చంపేట మీడియా సమావేశంలో ప్రకటించిన నాగర్ కర్నూలు ఎంపీ, క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి
తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ బీఎం సందీప్ నేడు హైదరాబాద్‌కు రాక
గాంధీభవన్‌లో నేడు కీలక సమావేశం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న మల్లు రవి వ్యాఖ్యలు
బీఎం సందీప్‌తో సమావేశం కావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం
ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారని క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి ప్రకటించడం వెనక ఆంతర్యం ఏమిటి?
కొండా సురేఖ మాదిరే రేవంత్ వర్గం ఎమ్మెల్యేల మీద వేటు వేయిస్తుందా?
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించారు తప్ప పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల మీద ఏం చర్యలు తీసుకుంటారు?
షోకాజ్ నోటీసులు ఇస్తారా? లేక సస్పెండ్ చేస్తారా?
సస్పెండ్ చేస్తే రాజగోపాల్ రెడ్డి వెనక ఉన్న ఎమ్మెల్యేలు ఎంత మంది?
రేవంత్ రెడ్డి, పొంగులేటి కుటుంబ దోపిడీపై అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు రగులుతున్నారా?
ఎమ్మెల్యేలకు కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా తాము మాత్రం వేల కోట్లు దోచుకుంటూ, లాభసాటి వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటున్నారని జోరుగా జరుగుతున్న చర్చ
ఈ అసంతృప్తి ఎక్కడికి దారితీస్తుందో అని సర్వత్రా నెలకొన్న ఆసక్తి
— Telugu Scribe (@TeluguScribe) November 22, 2026
Read Also :
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mallu Ravi | ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారు : మల్లు రవి
YSRCP | టీడీపీ ఎమ్మెల్యే జయరాం వర్గీయుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
Army Families Killed | లారీ ఢీకొట్టడంతో రెండు ముక్కలైన కారు.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి
Srinath Maganti | సుశాంత్ స్థానంలో కార్తీక్‌గా మెప్పించిన శ్రీనాథ్ మాగంటి.. ‘ఈఎన్ఈ రిపీట్’తో అద్భుత విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

