Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు 2026 సంవత్సరం కెరీర్లోనే అత్యంత విజయవంతమైన ఏడాదిగా నిలిచింది. వరుస సినిమాల విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న ఆయన.. ఒకే ఏడాదిలో మూడు చిత్రాలతో రూ.200 కోట్ల మార్కును దాటడం విశేషం. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాల విజయాల తర్వాత తాజాగా విడుదలైన ‘సీన్’ కూడా భారీ విజయం సాధించింది.
Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు 2026 సంవత్సరం కెరీర్లోనే అత్యంత విజయవంతమైన ఏడాదిగా నిలిచింది. వరుస సినిమాల విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న ఆయన.. ఒకే ఏడాదిలో మూడు చిత్రాలతో రూ.200 కోట్ల మార్కును దాటడం విశేషం. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాల విజయాల తర్వాత తాజాగా విడుదలైన ‘సీన్’ కూడా భారీ విజయం సాధించింది. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ విజయంతో సంతోషం వ్యక్తం చేసిన సూర్య.. తాజాగా అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ వీడియోను విడుదల చేశారు.
‘సీన్’ సినిమాకు థియేటర్లలో వస్తున్న స్పందన చూసి సూర్య ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులు సినిమాను ఆదరించడమే కాకుండా, థియేటర్లలో పండుగ వాతావరణాన్ని సృష్టించారని ఆయన తెలిపారు. సినిమాలోని సన్నివేశాలను విశ్లేషిస్తూ, సోషల్ మీడియాలో చర్చిస్తూ, పాజిటివ్ రివ్యూలతో సినిమాను మరింత పెద్ద విజయానికి తీసుకెళ్లారని కొనియాడారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. అభిమానులు, తమ్ముళ్లు, చెల్లెళ్లు, ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. సినిమా విజయాన్ని చిత్ర బృందం కంటే ప్రేక్షకులే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని, వారి ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
ఈ సినిమా విజయానికి సహకరించిన థియేటర్ యజమానులు, మీడియా ప్రతినిధులు, విమర్శకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అన్ని భాషల అభిమానులకు సూర్య ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన డిస్ట్రిబ్యూటర్ శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీకి కూడా చిత్ర బృందం తరఫున కృతజ్ఞతలు చెప్పారు. త్వరలోనే మరో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తానని హామీ ఇచ్చారు. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ‘సీన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా సూర్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానానికి చేరుకుంది. ఇంతకుముందు సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రపంచవ్యాప్తంగా రూ.209.46 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తాజాగా ‘సీన్’ ఆ వసూళ్లను అధిగమించింది. సూర్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘కరుప్పు’ కొనసాగుతుండగా, దాని తర్వాతి స్థానంలో ‘సీన్’ నిలిచింది.
‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘సీన్’ సినిమాలతో 2026లో వరుస విజయాలను అందుకున్న సూర్య.. ఒకే ఏడాదిలో మూడు చిత్రాలు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది సూర్య కెరీర్లోనే గోల్డెన్ ఇయర్‌గా నిలిచిపోయింది.
A Special Note from ‘THE ONE’ @Suriya_offl ❤️
Thank You All! Your Love and Support Made #SCENE a Truly Special Blockbuster!
@jithumadavan #Jyotika #NazriyaFahadh #Naslen @sushintdt @2D_ENTPVTLTD @SonyMusicSouth https://t.co/daWmIrKA82
— Zhagaram Studios (@ZhagaramOffl) November 21, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

