Army Families Killed | లారీ ఢీకొట్టడంతో రెండు ముక్కలైన కారు.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి
Army Families Killed | వేగంగా వచ్చిన లారీ ఒక కారును ఢీకొట్టింది. ఆ ధాటికి ఆ కారు రెండు ముక్కలు కావడంతో పాటు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణించిన ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు ఈ ప్రమాదంలో మరణించారు.
గాంధీనగర్: వేగంగా వచ్చిన లారీ ఒక కారును ఢీకొట్టింది. ఆ ధాటికి ఆ కారు రెండు ముక్కలు కావడంతో పాటు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణించిన ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు ఈ ప్రమాదంలో మరణించారు. (Army Families Killed) గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి భుజ్-ఖవడా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ట్రైలర్ లారీ ఒక కారును ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు అది రెండు ముక్కలైంది. అందులో ప్రయాణిస్తున్న మూడు నెలల చిన్నారితో సహా ఏడుగురు అక్కడికక్కడే మరణించారు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకుని ఛిద్రమైన మృతదేహాలను బయటకు తీసేందుకు పలు గంటల పాటు శ్రమించారు. మృతులను 35 ఏళ్ల రింకీ నితిన్ గుసైన్, ఆమె 4 నెలల కుమార్తె వామిక, 30 ఏళ్ల సౌరభ్ సింగ్ నేగి, ఆయన భార్య 30 ఏళ్ల సవిత, వారి మూడు నెలల కుమార్తె సివిక, 35 ఏళ్ల రాజేష్ రావత్, ఆయన కుమార్తె అయిన 7 ఏళ్ల రక్షితగా గుర్తించారు.
మరోవైపు మృతులంతా ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్కు చెందినవారని పోలీస్ అధికారి తెలిపారు. భుజ్‌లో విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది కుటుంబ సభ్యులని చెప్పారు. రన్ ఆఫ్ కచ్‌ను సందర్శించి భుజ్‌కు కారులో తిరిగి వెళ్తుండగా ట్రైలర్ లారీ ఢీకొట్టడంతో అందులో ఉన్న వారంతా మరణించినట్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Army Families
- car
- Gujarat
- Half
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
Army Families Killed | లారీ ఢీకొట్టడంతో రెండు ముక్కలైన కారు.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి
Srinath Maganti | సుశాంత్ స్థానంలో కార్తీక్‌గా మెప్పించిన శ్రీనాథ్ మాగంటి.. ‘ఈఎన్ఈ రిపీట్’తో అద్భుత విజయం!
Sweet Potato | రూ.20కే లభించే ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం.. చలికాలంలో తప్పక తినాల్సిందే.. ఎందుకంటే..
Dasoju Shravan Kumar | ఆ రూ.300 కోట్లు గంగలో కలిసినయి.. ఇప్పుడు ఇంటర్ బోర్డు రద్దంటున్నడు : ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

