Sweet Potato | రూ.20కే లభించే ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం.. చలికాలంలో తప్పక తినాల్సిందే.. ఎందుకంటే..
చలికాలం వచ్చిందంటే రకరకాల ఆహార పదార్థాలు మనకు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్లో లభించే కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో చిలగడదుంప (స్వీట్ పొటాటో) ప్రత్యేకమైనది. కేవలం రూ.20కే లభించే ఈ దుంపతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Sweet Potato | చలికాలం వచ్చిందంటే రకరకాల ఆహార పదార్థాలు మనకు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్లో లభించే కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో చిలగడదుంప (స్వీట్ పొటాటో) ప్రత్యేకమైనది. కేవలం రూ.20కే లభించే ఈ దుంపతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాల్చిన చిలగడదుంప ముక్కలపై కొద్దిగా చాట్ మసాలా, నిమ్మరసం చల్లుకుని తినడం ఈ సీజన్లో తీసుకోగలిగే ఉత్తమమైన ఆహారాల్లో ఒకటి.
కంటిచూపు పెరిగేందుకు..
చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. శరీరం దీనిని విటమిన్ ఎ గా మార్చుకుంటుంది. ఒక చిలగడదుంప తినడం ద్వారా శరీరానికి రోజువారీ అవసరమైన బీటా కెరోటిన్‌ను పొందవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటి చూపును కాపాడడంలో, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడంలోనూ సహాయపడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి కూడా సహకరిస్తుంది.
బీపీ తగ్గుతుంది..
చిలగడదుంపల్లో పొటాషియం కూడా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే చిలగడదుంపలు శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడానికి కారణం కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉడికించి, కాల్చి తినడంతోపాటు కూరలు, వేపుళ్లు, చాట్ వంటి వివిధ రకాల వంటకాల్లోనూ ఉపయోగించుకోవచ్చు.
జాగ్రత్తలు తప్పనిసరి..
అయితే చిలగడదుంపలను అతిగా తినకూడదు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, తక్కువ కార్బొహైడ్రేట్లు తీసుకోవాలని వైద్యులు సూచించినవారు, సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగినవారు వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వీటికి దూరంగా ఉండడం మంచిది. ప్రతి ఒక్కరూ తమ శరీర పరిస్థితిని, వైద్యుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. చలికాలంలో చిలగడదుంపలను ఆహారంలో చేర్చుకోవచ్చని, అయితే తీసుకునే పరిమాణం విషయంలో తప్పనిసరిగా నియంత్రణ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sweet Potato | రూ.20కే లభించే ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం.. చలికాలంలో తప్పక తినాల్సిందే.. ఎందుకంటే..
Dasoju Shravan Kumar | ఆ రూ.300 కోట్లు గంగలో కలిసినయి.. ఇప్పుడు ఇంటర్ బోర్డు రద్దంటున్నడు : ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్
POCSO case | ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
Pre Diabetes | ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి.. ఈ దశ నుంచి ఎలా బయట పడాలి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Disha Patani | సైకిల్ పక్కన దిశా పటానీ అందాల పోజులు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

