ఫార్మసీలో పైథాన్
ఇప్పటి దాకా ఇంజినీరింగ్ విద్యార్థులకే పరిమితమైన పైథాన్ కోడింగ్ ఇక నుంచి ఫార్మసీ విద్యార్థులకు తప్పనిసరి కానున్నది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంతర్భాగం కానుంది. మెషిన్ లెర్నింగ్, డాటా అనాలసిస్ వంటి ఆధునాతన సాంకేతికతలు ప్రవేశించనున్నాయి.
- సిలబస్‌లో సమూల మార్పులు
- ఇంజినీరింగ్ తరహాలో కోడింగ్
- అంతర్భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
- ఫార్మా ఇండస్ట్రీ, దవాఖానల్లోఇంటర్న్షిప్ తప్పనసరి
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఇప్పటి దాకా ఇంజినీరింగ్ విద్యార్థులకే పరిమితమైన పైథాన్ కోడింగ్ ఇక నుంచి ఫార్మసీ విద్యార్థులకు తప్పనిసరి కానున్నది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంతర్భాగం కానుంది. మెషిన్ లెర్నింగ్, డాటా అనాలసిస్ వంటి ఆధునాతన సాంకేతికతలు ప్రవేశించనున్నాయి. కాలం చెల్లిన పాఠ్యాంశాలకు ముగింపు పలుకుతూ ఫార్మసీ సిలబస్‌లో కీలక మార్పలు చోటుచేసుకున్నాయి. బీ ఫార్మసీ ఫస్టియర్‌లోనే పైథాన్‌ను అంతర్భాగం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను చేర్చారు. కొత్త సిలబస్ 2026 -27 విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి వస్తుంది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిన ఈ సిలబస్‌ను ఇటీవలే జేఎన్టీయూహెచ్ ఆమోదించింది. సవరించిన సిలబస్‌ను కాలేజీలకు పంపించారు. మొత్తం క్రెడిట్స్‌ను 203 నుంచి 193కు కుదించారు.
బట్టి చదువులకు బైబై
పుస్తకాలు, బట్టి సంస్కృతికి బదులు ప్రాక్టికల్, ఇండస్ట్రీ నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. బట్టి చదువులకు బైబై చెప్పేలా రూపొందించారు. ఫార్మసీ విద్యార్థులు కేవల మెడికల్ షాపులు, సంప్రదాయ ఫార్మా కంపెనీలకే పరిమితం కాకుండా ఫార్మాడాటా సైన్స్, క్లినికల్ రీసెర్చ్ ఏఐ, డ్రగ్ డిస్కవరీ వంటి విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడేలా సిలబస్‌ను రూపొందించారు. బట్టి విధానానికి బదులుగా మొదటి సంవత్సరం నుంచే ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలపై ఎక్కువ దృష్టిసారించి సిలబస్‌లో మార్పులు చేశారు.
సిలబస్‌లో మార్పులు
- టెక్నాలజీ సబ్జెక్టులను తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం సెమిస్టర్ -1లో పైథాన్, ప్రోగ్రామింగ్ (ఫౌండేషన్ ఫర్ కంప్యూటేషనల్ థింకింగ్) సబ్జెక్టును చేర్చారు. ఏఐ, డాటా అనాలిసిస్ సులభంగా నేర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- సెమిస్టర్ -2లో డాటా అనాలసిస్, బయో స్టాటిస్టిక్స్ను ప్రవేశపెట్టారు. ఇది డాటా విశ్లేషించేందుకు సహాయపడుతుంది.
- సెమిస్టర్ -3లో మెషిన్ లెర్నింగ్, సెమిస్టర్ -6లో ఏఐ ఇన్ ఫార్మాస్టూటికల్ సైన్సెస్, సెమిస్టర్ -7లో ఏఐ ఇన్ క్లినికల్ అప్లికేషన్స్, సెమిస్టర్ -8లో ఎథికల్ ఏఐ ఇన్ ఫార్మసీ వంటి సబ్జెక్టులను చేర్చారు.
- ఫార్మసీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. ప్రాక్టికల్ అనుభవం కోసం ఫార్మా ఇండస్ట్రీ, దవాఖానల్లో ఒకసారి 120, మరోసారి 240గంటల పాటు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.
- ఐదో సెమిస్టర్ నుంచి విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి ఇండస్ట్రియల్ ఫార్మసీ, క్లినికల్ ఫార్మసీ విభాగాలను ఎంచుకోవచ్చు. కంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్, ఫార్మాస్యూటికల్ ఆటోమేషన్, రోబోటిక్ ఫార్మసీ వంటి 30 ఎలక్టివ్స్‌గా ఎంచుకోవచ్చు.
- ఫార్మసీలోను మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అవకాశం కల్పించారు. రెండేండ్ల తర్వాత డిప్లొమా.. మూడేండ్ల తర్వాత అడ్వాన్స్డ్ డిప్లొమా నాలుగేండ్లు పూర్తిచేస్తే బీ ఫార్మసీ డిగ్రీ లభిస్తుంది.
ఆహ్వానించదగ్గ పరిణామం
ఫార్మా పరిశ్రమ, పరిశోధన రంగాల అవసరాల మేరకు ఫార్మసీ సిలబస్‌ను మార్చారు. సిలబస్ మార్చడం ఆహ్వానించదగిన పరిణామం. ఇది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్తు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుంది. హైదరాబాద్ ఫార్మా పరిశ్రమలు గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్‌గా ఎదుగుతున్నాయి. కొత్త సిలబస్ శాస్త్రవేత్తలుగా, జీసీసీల్లో పనిచేసే నైపుణ్యంతో కూడిన వర్క్‌ఫోర్స్‌గా ఎదగడానికి అవకాశమేర్పడుతుంది.
జైపాల్‌రెడ్డి తుమ్మ, సేయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజీ, వరంగల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

