కాంగ్రెస్‌తో నగరానికి బ్యాడ్ ఇమేజ్!
‘కాంగ్రెస్ నాయకుల అక్రమాలు, దా డులు దౌర్జన్యాలతో హైదరాబాద్ మహానగరానికి బ్యాడ్ ఇమేజ్ వస్తున్నది. ప్రపంచవ్యాప్తం గా ఉన్న బ్రాండ్ ఇమేజ్ మసకబారుతున్నది’ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలపై సంచలన ఆరోపణలు చేశారు. అనుముల, పొంగులేటి ఫ్యామిలీలు యథేచ్ఛగా తెలంగాణను కొల్లగొడుతున్నాయని, లూటీలో ఆ రెండు కుటుంబాలు పోటీపడుతున్నాయని ఆరోపించారు.
- కాంగ్రెస్ నేతల దాడులు, దౌర్జన్యాలు.. అక్రమాలతో బ్రాండ్ ఇమేజ్‌కు మసక
- లూటీలో అనుముల, పొంగులేటి పోటీ.. యథేచ్ఛగా ఆ ఇద్దరి ఫ్యామిలీల అక్రమాలు
- మొన్న ఆర్ఆర్ ట్యాక్స్.. నేడు పీఆర్ ట్యాక్స్
- రేవంత్ కూతురు నైమిషా కార్పొరేట్ స్కూల్ పొంగులేటి స్వప్నిరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్
- బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ నాయకుల అక్రమాలు, దా డులు దౌర్జన్యాలతో హైదరాబాద్ మహానగరానికి బ్యాడ్ ఇమేజ్ వస్తున్నది. ప్రపంచవ్యాప్తం గా ఉన్న బ్రాండ్ ఇమేజ్ మసకబారుతున్నది’ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలపై సంచలన ఆరోపణలు చేశారు. అనుముల, పొంగులేటి ఫ్యామిలీలు యథేచ్ఛగా తెలంగాణను కొల్లగొడుతున్నాయని, లూటీలో ఆ రెండు కుటుంబాలు పోటీపడుతున్నాయని ఆరోపించారు.
మొన్న సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి డిఫెన్స్ రంగంలో అడుగుపెట్టి టెస్సెరాక్ట్ కంపెనీ పెట్టగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు రాఘవ సైతం కొత్త డిఫెన్స్ కంపె నీ తెరిచారని చెప్పారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ తరహాలో పీఆర్ (పొంగులేటి రెడ్డి) ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం కూతురు నైమిషారెడ్డి మైండ్వాల్ట్ కంపె నీ ముసుగులో కార్పొరేట్ స్కూల్ ఏర్పాటుకు సంకల్పిస్తే.. ఇప్పుడు పొంగులేటి బిడ్డ స్వప్నిరెడ్డి మావ్ ఎడ్యూ పేరిట ఇంటర్నేషనల్ స్కూ ల్ ఏర్పాటుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
సీకేసీఆర్ పాలనలో టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి, శాంతిభద్రతలకు ప్రాధాన్యమిచ్చి 27వేల కంపెనీలు ఏర్పాటుచేసి 18.29 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని దుయ్యబట్టారు. ఒక్క ఐటీలోనే 7వేల ఉద్యోగాలు పో యాయని కానీ సీఎం, మంత్రుల కుటుంబీకుల ఆస్తులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు వ్యాపారాలు చేసుకుంటూ, కాంట్రాక్టులు దక్కించుకొని ప్రజాధనాన్ని దిగమింగుతున్నారని ధ్వజమెత్తారు. ఇది తాను చెప్పడం లేదని సీఎం సొంత పార్టీ ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి చెప్తున్నారని పేర్కొన్నారు.
‘మెటా’పై కాంగ్రెస్ దాడి దుర్మార్గం
హైదరాబాద్‌లో దేశంలోనే మెటా రెండో అతిపెద్ద ఫేస్బుక్ క్యాంపస్‌పై యూత్ కాంగ్రెస్ కార్యకర్తల దాడి దుర్మార్గమని మన్నె క్రిశాంక్ ఖండించారు. ఈ దాడి దేనికి సంకేతమని, ఇది తెలంగాణకు బ్లాక్‌డే అని అభివర్ణించారు. గ్లోబల్ సమ్మిట్ అని గొప్పలు చెప్తున్న రేవంత్‌రెడ్డి.. మెటాపై దాడి విషయంలో స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం సోష ల్ మీడియాను అణచివేస్తున్నదని గగ్గొలు పె డుతున్న రాహుల్‌గాంధీ.. ఫేస్బుక్ కార్యాలయంపై దాడి గురించి ఎందుకు మౌనం దా ల్చారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జరిగేది గోబర్ సమ్మిట్
రాష్ట్రంలో జరుగుబోయేది గ్లోబల్ సమ్మిట్ కాదని, గోబర్ సమ్మిట్ అని మన్నె క్రిశాంక్ ఎ ద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో కమీషన్ల ము సుగులో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని దు య్యబట్టారు. ‘హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని, అనుముల బ్రదర్స్ రియల్ ఎస్టేట్ పెరిగిపోతున్నదని మండిపడ్డారు. గురుకులాల పిల్లలు విషాహారం తిని చనిపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కానీ, ఆయన కూతురు నైమిషారెడ్డి, మంత్రి పొంగులేటి కూతురు స్వప్నిరెడ్డి కొత్త కార్పొరేట్ స్కూళ్లు తెరువడంలో పోటీపడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొంటున్న వారు తెలంగాణలోని యూనివర్సిటీలను విస్మరించడంలోని అంతర్యమేందని నిలదీశారు.
విచారణపై బీజేపీ వెనుకడుగు!
ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని గతంలో హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా బీజేపీ కేంద్ర మంత్రి అమిత్‌షా ఆరోపణలు గుప్పించిన విషయాన్ని మన్నె క్రిశాంక్ ప్రస్తావించారు. ఇలాంటి అక్రమ వసూళ్లపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. గతంలో మంత్రి పొంగులేటి ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగాయని, నోట్ల కట్టలు లెక్కించేందుకు మిషన్లు తీసుకెళ్లారని, ఈ విషయాన్ని మీడియా ప్రపంచానికి చూపిందని గుర్తుచేశా రు. కానీ ఈడీ ఎందుకు విచారణ జరుపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రేవంత్ సర్కా ర్ అక్రమాలపై కేంద్రం విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. లేదంటే తగిన సమయంలో రెండు పార్టీలకు కర్రుకాల్చి వాతపెడతారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

