The Lakshmana | వెండితెరపై లక్ష్మణుడి అజ్ఞాత వీరగాథ.. ఆకట్టుకుంటున్న ‘ది లక్ష్మణ’ ఫస్ట్ లుక్ పోస్టర్!
Indian Cinema | భారతీయ సినీ రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. రామాయణ మహాకావ్యంలో శ్రీరాముడికి అండగా నిలిచి, ఎన్నో సాహసాలు చేసిన మహా యోధుడు లక్ష్మణుడి జీవితంలోని వెలుగులోకి రాని విశేషాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
The Lakshmana UntoldStory | భారతీయ సినీ రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. రామాయణ మహాకావ్యంలో శ్రీరాముడికి అండగా నిలిచి, ఎన్నో సాహసాలు చేసిన మహా యోధుడు లక్ష్మణుడి జీవితంలోని వెలుగులోకి రాని విశేషాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి, భారతదేశంలోనే తొలి ఫోటోరియలిస్టిక్ ఏఐ చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సరికొత్త కథనం, అద్భుతమైన విజువల్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా భారతీయ చలనచిత్ర నిర్మాణ రంగంలో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది.
రామాయణంలో లక్ష్మణుడి పాత్రకున్న ప్రాధాన్యత, ఆయన చేసిన సాహసాలు, త్యాగాలు, అసాధారణ వీరత్వాన్ని ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త కోణంలో ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. శ్రీమతి మాతా రాజేశ్వరి సమర్పణలో భూమాత ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి పి. రాధాకృష్ణ కథను అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పవన్ మాతా, నితిన్ మాతా నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, బియాండ్ ఎక్స్ స్టూడియో (Beyond X Studio), నాపో డాట్ ఎస్ఐ (napo.si) సంస్థలు ఏఐ సాంకేతిక నిర్మాణ బాధ్యతలను చూసుకుంటున్నాయి.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తన ఎక్స్ (X) ఖాతా ద్వారా డిజిటల్‌గా విడుదల చేయగా, మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ భౌతికంగా ఆవిష్కరించారు. విడుదలైన పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యేలా తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక గొప్ప యోధుడి అజ్ఞాత వీరగాథను అత్యాధునిక ఏఐ సాంకేతికతతో ప్రపంచానికి పరిచయం చేయనున్న ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’ పై ఇప్పుడు సినీ ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Lakshmana | వెండితెరపై లక్ష్మణుడి అజ్ఞాత వీరగాథ.. ఆకట్టుకుంటున్న ‘ది లక్ష్మణ’ ఫస్ట్ లుక్ పోస్టర్!
Mallu Ravi | ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారు : మల్లు రవి
YSRCP | టీడీపీ ఎమ్మెల్యే జయరాం వర్గీయుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
Army Families Killed | లారీ ఢీకొట్టడంతో రెండు ముక్కలైన కారు.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

