న్యూఢిల్లీ: తన కారును ఆటో స్వల్పంగా ఢీకొట్టడంతో ఒక మహిళ ఆగ్రహం చెందింది. ఆ ఆటోపై తన ప్రతాపాన్ని చూపింది. హెడ్‌లైట్, వైపర్‌ను ధ్వంసం చేసింది. ఆటో డ్రైవర్‌ను ఆ మహిళ దూషించింది. తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆమె అన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (woman vandalises auto) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. హైదర్‌పూర్ బాద్లీ మోర్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డుపై వెళ్తున్న కారును ఒక ఆటో స్వల్పంగా రాసుకున్నది. ఈ నేపథ్యంలో ఆ కారులోని మహిళ ఆగ్రహించింది. ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగింది. అంతటితో ఆగక ఆ ఆటోను ధ్వంసం చేసింది. హైడ్లైట్తో పాటు వైపర్‌ను విరిచేందుకు ప్రయత్నించింది. ఆటో డ్రైవర్‌ను దూషించడంతో పాటు, తాను సిబ్బందినని, తనపై ఎలాంటి చర్య తీసుకోరని ఆమె అన్నది.
కాగా, ఆ సమయంలో బైక్‌పై అటుగా వెళ్తున్న విశాల్ అనే రాపిడో డ్రైవర్ ఈ గొడవను గమనించాడు. ఆ మహిళ ఆటోను ధ్వంసం చేసిన వీడియోను రికార్డ్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ మహిళ ప్రవర్తనను నెటిజన్లు తప్పుపట్టారు. ఆటోకు జరిగిన నష్టానికి సంబంధించి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసులకు ఈ వీడియో క్లిప్‌ను ట్యాగ్ చేశారు. కారు నంబర్ ఆధారంగా ఆ మహిళను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.
हाइदरपुर बादली मोड़ मेट्रो स्टेशन के सामने इस महिला ने ऑटो वाले का बड़ा नुकसान कर दिया और खुद को ‘स्टाफ’ बताकर धमकी देने लगी।
इस पर तुरंत सख्त एक्शन लिया जाए। pic.twitter.com/LXMzKXwYOt
— Mohammad Imran (@ImranTG1) September 18, 2026