man stabs twin sister | ఇన్స్టాగ్రామ్ యువతితో బ్రేకప్.. కవల సోదరి, తల్లిపై కత్తితో వ్యక్తి దాడి
man stabs twin sister | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పింది. కవల సోదరి, తల్లి దీనికి కారణమని వ్యక్తి భావించాడు. హోలీ పండగ కోసం ఇంటికి వచ్చిన అతడు దారుణంగా ప్రవర్తించారు. సోదరిని 40 సార్లు కత్తితో పొడిచి చంపాడు. తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు.
లక్నో: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పింది. కవల సోదరి, తల్లి దీనికి కారణమని వ్యక్తి భావించాడు. హోలీ పండగ కోసం ఇంటికి వచ్చిన అతడు దారుణంగా ప్రవర్తించారు. సోదరిని 40 సార్లు కత్తితో పొడిచి చంపాడు. తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు. (man stabs twin sister) ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. బుద్ధి విహార్ కాలనీలో నివసించే నీలిమ ఒక ఆరోగ్య బీమా కంపెనీలో పనిచేస్తున్నది. ఆమె కవల పిల్లలైన 25 ఏళ్ల హార్దిక్, హిమ్షిఖ గురుగ్రామ్‌లో పనిచేస్తున్నారు. వారిద్దరూ కలిసి అక్కడ నివసిస్తున్నారు.
కాగా, హోలీ జరుపుకునేందుకు కొడుకు, కుమార్తె కలిసి మొరాదాబాద్‌లోని తల్లి నీలిమ ఇంటికి వచ్చారు. హోలీని ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. శుక్రవారం ఉదయం నీలిమ ఆఫీస్‌కు వెళ్లింది. హార్దిక్, హిమ్షిఖ ఇంట్లో ఉన్నారు. ఈ సందర్భంగా కవల సోదరి అయిన హిమ్షిఖను హార్దిక్ 40 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో రక్తం మడుగుల్లో పడి ఆమె మరణించింది.
ఆ తర్వాత హార్దిక్ తన తల్లి పని చేసే కార్యాలయానికి వెళ్లాడు. తనతో ఇంటికి రావాలని చెప్పాడు. నీలిమ ఇంట్లోకి ప్రవేశించగా కుమార్తె రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్ అయ్యింది. ఇంతలో హార్దిక్ తన తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆమెను పలుమార్లు పొడిచి పారిపోయాడు. నీలిమ అరుపులు విన్న స్థానికులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఆమెను, కుమార్తెను హాస్పిటల్‌కు తరలించారు. అయితే హిమ్షిఖ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నీలిమను అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హిమ్షిఖ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. సోదరుడు ఆమెను కత్తితో 40 సార్లు పొడిచి దారుణంగా చంపినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. నిందితుడైన హార్దిక్‌ను అరెస్ట్ చేశారు.
అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన పూణేకు చెందిన యువతిని అతడు ప్రేమించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఏడు నెలల కిందట ఆమెతో బ్రేకప్‌కు తన తల్లి, సోదరి కారణమని అతడు నమ్మాడు. నాటి నుంచి చిన్న విషయాలకు కోపంగా ప్రవర్తిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ప్రియురాలితో బ్రేకప్‌కు కారణమైన సోదరిని, తల్లిని హత్య చేయాలని బావించినట్లు హార్దిక్ చెప్పాడని పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడిని రిమాండ్ కోసం జైలుకు తరలించినట్లు వెల్లడించారు. అయితే ఎంతో ఆనందంతో హోలీ జరుపుకున్న నీలిమ కుటుంబం ఈ సంఘటనతో విచ్చిన్నం కావడం స్థానికులను షాకింగ్‌కు గురిచేసింది.
Also Read:
Student Stabbed To Death | పరీక్షలో సహకరించనందుకు.. బాలుడిని కత్తితో పొడిచి చంపిన విద్యార్థులు
Woman, Lover Kill Husband | ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ.. ఆ తర్వాత అతడితో పెళ్లి
Watch: విద్యార్థులతో ప్రధానోపాధ్యాయురాలు మసాజ్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

