భోపాల్: పరీక్షలో జవాబులు చూపనందుకు ఒక విద్యార్థితో కొందరు స్టూడెంట్స్ గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో చివరి పరీక్ష తర్వాత బయటకు వచ్చిన బాలుడ్ని చుట్టుముట్టారు. ఆ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. మధ్యప్రదేశ్లోని దామోహ్లో ఈ సంఘటన జరిగింది. ( Student Stabbed To Death) ఇమ్లై గ్రామానికి చెందిన 15 ఏళ్ల రిషి అహిర్వర్ పదో తరగతి చదువుతున్నాడు. దామోహ్లోని ఎగ్జామ్ సెంటర్లో బోర్డు పరీక్షలకు హాజరయ్యాడు.
కాగా, పరీక్ష సందర్భంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని కొంత మంది విద్యార్థులు రిషిని అడిగారు. అతడు నిరాకరించడంతో కక్షగట్టారు. ఫిబ్రవరి 27న, మార్చి 2న రిషి, కొందరు విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ పరీక్ష రోజున అతడికి గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు.
మరోవైపు మార్చి 6న శుక్రవారం చివరి పరీక్ష రాసిన తర్వాత రిషి బయటకు వచ్చాడు. సుమారు 8 మంది విద్యార్థులు అతడ్ని చుట్టుముట్టి దాడి చేశారు. రిషిని కత్తితో పొడిచి పారిపోయారు. చేతిపై తీవ్ర గాయం కావడంతో అధిక రక్తస్రావం జరిగింది.
రిషిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ నేపథ్యంలో నిందితులైన మైనర్ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Woman, Lover Kill Husband | ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ.. ఆ తర్వాత అతడితో పెళ్లి
Girls Sucide In Temple Bathroom | గుడిలోని బాత్రూమ్లో.. ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ఆత్మహత్య
Man Kills Friend | మాజీ భార్యకు గిఫ్ట్ కొనేందుకు.. స్నేహితుడ్ని చంపి డబ్బు దొంగిలించిన వ్యక్తి
Watch: లోతైన బావిలో పడిన ఏనుగు పిల్ల.. ఎలా రక్షించారంటే?