Quadruplet Girls | ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. ఇప్పటికే ముగ్గురు పిల్లలు..!
Quadruplet Girls | ఆస్ట్రేలియా (Australia) కు చెందిన ఓ 34 ఏళ్ల మహిళ ఆశ్చర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆమె ఇటీవల నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటికే ముగ్గురు చిన్న పిల్లలను పెంచుతున్న ఆ ఇంటిసభ్యుల సంఖ్య ఈ నలుగురు పిల్లల రాకతో మొత్తం 9 కి పెరిగింది.
Quadruplet Girls : ఆస్ట్రేలియా (Australia) కు చెందిన ఓ 34 ఏళ్ల మహిళ ఆశ్చర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆమె ఇటీవల నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటికే ముగ్గురు చిన్న పిల్లలను పెంచుతున్న ఆ ఇంటిసభ్యుల సంఖ్య ఈ నలుగురు పిల్లల రాకతో మొత్తం 9 కి పెరిగింది. కానీ ఈ సంతోషకరమైన పరిణామం రాత్రికి రాత్రే వారికి సరికొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది.
నలుగురు ఆడపిల్లలు పుట్టడం తల్లిదండ్రులుగా తాము మర్చిపోలేని ఆశీర్వాదమని ఆ దంపతులు అన్నారు. అయితే వారిని సంరక్షించేందుకు ఆర్థిక వనరులు అవసరమని, ముఖ్యంగా డైపర్లు, పాలు, బట్టలు లాంటి రోజువారీ ఖర్చులు ఊహించని భారమేనని ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి నలుగురు నవజాత శిశువులను పోషించేందుకు స్నేహితులు, అభిమానులు చాలా సాయంగా నిలిచారని తెలిపారు. మరికొంత మంది కూడా ఆ దంపతులపట్ల ప్రశంసలు కురిపిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.
ఇంత పెద్ద కుటుంబాన్ని నిర్వహించే క్రమంలో సమాజం నుంచి లభిస్తున్న మద్దతు వారికి ఎంతో విలువైందిగా మారింది. అయితే పిల్లలు అందరితో కలిసి ఒకేసారి బయటికి వెళ్లడం ఇప్పుడు ఆ దంపతులకు ఒక సమస్యగా మారింది. ప్రస్తుతం వాళ్లకు ఉన్న కారులో అందరూ సురక్షితంగా కూర్చోవడానికి సరిపడా సీట్లు లేవు. ఆసుపత్రి పర్యటనలు, స్కూల్ డ్రాప్లు, ఇతర ప్రయాణాలు సులభంగా సాగేందుకు 10 సీట్ల వ్యాన్ అవసరం ఉంటుందని ఆ కుటుంబం భావిస్తున్నది. అలాంటి వ్యాన్ను కొనుగోలు చేయడానికి ఆ తల్లి ఆన్లైన్లో విరాళాల సేకరణను ప్రారంభించింది.
మోనోజైగోటిక్ క్వాడ్రప్లెట్స్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన గర్భధారణ రకాల్లో ఒకటి. అయితే నామోనా పేరుగల ఈ మహిళ విషయంలో విశేషం ఏమిటంటే.. ఆమెకు పుట్టిన ఈ నలుగురు శిశువులకు ఒకే మాయ ఉందని ఆమెకు వైద్యం చేసిన డాక్టర్అలెక్సా బెండాల్ తెలిపారు. ఇలా 1.5 కోట్ల కేసుల్లో ఒకరికి మాత్రమే జరుగుతుందని చెప్పారు. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఒకటి రెండు కేసులు ఉండి ఉండవచ్చు కానీ ఆస్ట్రేలియాలో తమకు తెలిసినంత వరకు ఇదే ఏకైక కేసు అని చెప్పారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

