Viral news | ‘ఆస్తులు పెద్దగా లేకున్నా జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు’.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!
Viral news | సొంత ఇల్లు కట్టుకోవడం, కారు కొనడం, సంపద కూడబెట్టడం లాంటివి ఈ రోజుల్లో వ్యక్తి విజయానికి గుర్తులుగా ఉన్నాయి. ఇలాంటి ప్రపంచంలో ఓ 35 ఏళ్ల వ్యక్తి తన జీవితం గురించి నిజాయితీగా షేర్ చేసుకున్న విషయాలు ఇంటర్నెట్లో ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. తన దగ్గర లేని వాటిపై దృష్టి పెట్టకుండా, గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తన జీవితంలో వచ్చిన మెరుగుదల గురించి అతను చెప్పాడు.
Viral news : సొంత ఇల్లు కట్టుకోవడం, కారు కొనడం, సంపద కూడబెట్టడం లాంటివి ఈ రోజుల్లో వ్యక్తి విజయానికి గుర్తులుగా ఉన్నాయి. ఇలాంటి ప్రపంచంలో ఓ 35 ఏళ్ల వ్యక్తి తన జీవితం గురించి నిజాయితీగా షేర్ చేసుకున్న విషయాలు ఇంటర్నెట్లో ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. తన దగ్గర లేని వాటిపై దృష్టి పెట్టకుండా, గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తన జీవితంలో వచ్చిన మెరుగుదల గురించి అతను చెప్పాడు. అతని ఆలోచనా విధానం అద్భుతమని, ఎంతో వినూత్నంగా అనిపిస్తున్నదని చాలామంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆశిష్ జైన్ ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుపెట్టారు. ఆ పోస్టుకు క్యాప్షన్లో ఆయన ఇలా రాశారు. ‘నాకు 35 ఏళ్లు. సొంత ఇల్లు లేదు. కారు లేదు. అంతగా బ్యాంకు బ్యాలెన్స్ లేదు. షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు లేవు. మంచి ఉద్యోగం కూడా లేదు. కానీ మంచి అద్దె ఇంట్లో ఉంటున్నా. ఉబెర్లో ప్రయాణించే స్థోమత కలిగి ఉన్నా. ఒక్క రూపాయి అప్పు లేదు. గత ఏడాదితో పోల్చితే నా శరీరం మరింత ఆరోగ్యంగా ఉంది. మానసికంగానూ గత ఏడాది కంటే మెరుగ్గా ఉన్నా. ఏడాది తర్వాత ఏమవుతుందనే ప్రాధాన్యం లేని విషయాల గురించి ఒత్తిడి పడటం మానేశా. ఇల్లు, కారు కొనాలనే ఒత్తిడిని నాపై పెట్టుకోవడం లేదు. భవిష్యత్తు గురించి తక్కువగా ఆలోచిస్తున్నా. శారీరక, మానసిక ఆరోగ్యంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నా. పొగతాగడం మానేశా. జంక్ ఫుడ్ తినడం కూడా తగ్గించా’ రాసుకొచ్చాడు.
అదేవిధంగా ‘పర్లేదు.. జీవితంలో ప్రతి విషయానికీ వెంటనే సమాధానం దొరకాల్సిన అవసరం లేదు. పర్లేదు.. వచ్చిన ప్రతి రోజు ఈవిధంగానే జీవించండి. మీపైనే దృష్టి పెట్టండి’ అని పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు రకరకాల స్పందనలు తెలియజేశారు. “అప్పు లేదు. రేపటి గురించి ఒత్తిడి లేదు. ధూమపానం మానేశారు. ఇతరులతో పోల్చుకోవడం కూడా ఆపేశారు. నాకు తెలిసిన చాలా మంది 35 ఏళ్ల వారికంటే ఇది ఎంతో బలమైన జీవన పరిస్థితి. అభినందనలు ఆశిష్” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.
మరో యూజర్ స్పందిస్తూ.. “ఆశిష్.. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. కృతజ్ఞతతో జీవించడం, ఇతరుల జీవనశైలితో పోల్చుకోకుండా మీతో మీరే పోటీ పడటం.. ఇదే అత్యంత ఆచరణీయ జీవన విధానం” అని పేర్కొన్నారు. “35 ఏళ్ల వయసులో అప్పులు లేకపోవడం, ఆరోగ్యమైన శరీరం, ప్రశాంతమైన మనసు.. ఇదే నిజమైన విజయం. ఈ విషయాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మన చేతిలో ఉన్న వాటిపైనే ప్రతిరోజు దృష్టి పెట్టడం.. పూర్తి చేయాల్సిన ఆశల జాబితా వెంట పరుగెత్తడం కంటే ఎంతో గొప్పది. ఇలాగే ముందుకు సాగండి” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

