Robert Peston | కృత్రిమ మేథవల్ల రాబోయే ఒకటి రెండేళ్లలో తీవ్ర ఆర్థిక సంక్షోభం : రాబర్ట్ పెస్టన్
Robert Peston | కరోనా మహమ్మారి (Corona Virus), 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనా వేసి హెచ్చరించిన ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ (British Journalist) రాబర్ట్ పెస్టన్ (Robert Peston).. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి కూడా హెచ్చరికలు చేశారు. ఏఐ టెక్నాలజీవల్ల మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని చెప్పారు.
Robert Peston : కరోనా మహమ్మారి (Corona Virus), 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనా వేసి హెచ్చరించిన ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ (British Journalist) రాబర్ట్ పెస్టన్ (Robert Peston).. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి కూడా హెచ్చరికలు చేశారు. ఏఐ టెక్నాలజీవల్ల మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని చెప్పారు. గతంలో కూడా ఆయన చేసిన హెచ్చరికలను కొందరు ‘భయపెట్టే ధోరణి’ గా కొట్టిపారేసినప్పటికీ.. తర్వాత అవే నిజమయ్యాయి.
అయితే ఇప్పుడు రాబర్ట్ పెస్టన్ చెప్పిన ఏఐ ముప్పుపై ప్రపంచమంతా ఆలోచిస్తోంది. పెస్టన్ తన కొత్త పుస్తకం ‘ది కిల్ స్విచ్’ లో ఏఐ వల్ల భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. రాబోయే ఒకటి రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని, ఏఐ కోసం డేటా సెంటర్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల కోసం అపారమైన పెట్టుబడులు తరలివెళ్తుండటమే దీనికి కారణమని విశ్లేషించారు.
ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి లేకుండా పోతే ప్రభుత్వాలు ఆదాయపు పన్ను లేకుండానే ప్రజా సేవలను నిర్వహించే మార్గాలపై ఆలోచించాలని ఆయన సూచించారు. గతంలో బ్యాంకింగ్ రంగం తీరువల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని 2007 లోనే హెచ్చరించినప్పుడు తనపై కొందరు వ్యతిరేకత వ్యక్తంచేశారని ఆయన గుర్తుచేశారు. అలాగే 2009-2010 సమయంలో చైనాలో పర్యటించిన అనుభవంతో 2019 చివరిలో ఊహించని కొత్త వైరస్ వెలుగుచూసినప్పుడు ప్రభుత్వ వర్గాలను అప్రమత్తం చేశానని ఆయన చెప్పారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

